సౌదీ అరేబియా లో మరలా తెరుచుకున్న మసీదులు

Saudi Arabia reopens mosquesPic source: Asianews.IT

సౌదీ అరేబియా లో మరల తెరుచుకున్న మసీదులు.

కరోనా మహమ్మారి వల్ల లాక్ డౌన్ విధించిన రెండు నెలల తర్వాత ప్రభుత్వం సడలింపులు అనుమతించగా సౌదీ లోని మసీదులు ఈ వారం తెరువబడ్డాయి.

"అందరూ తమ ఇళ్లలో కాకుండా మసీదుకు వచ్చి ప్రార్ధించడానికి పిలవడం మరియు అందరూ ఆ దేవుని దయను అనుభవించడం ఎంతో గొప్ప భాగ్యం" అని అబ్దుల్ మజీద్ అల్ మోహెఐసెన్ అన్నారు.

మసీదుకు వచ్చినవారు మాస్కులు ధరించి, తమ స్వంత ప్రార్ధనా పట్టలను తీసుకొని వచ్చి, ఒకరికొకరు మధ్య రెండు మీటర్ల దూరాన్ని పాటిస్తూ ప్రార్ధనలో పాల్గొన్నారు.

మసీదులను తెరిచిన వెంటనే విశ్వాసులు వడివడిగా వెళ్లి తమ ప్రార్థనలను అర్పించి తమ భాద్యతను నిర్వర్తించారని సౌదీ అరేబియా ఇస్లామిక్ మంత్రిత్వశాఖ వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

విశ్వాసులు మాస్కులు ధరించి ప్రార్ధిస్తూ, మరియు ప్రార్ధన అనంతరం అందరూ శానిటైజర్ తో చేతులను శుభ్రపరచుకోవడం వంటి వీడియోలను కూడా సౌదీ అరేబియా ఇస్లామిక్ మంత్రిత్వశాఖ విడుదల చేసింది.

ప్రజలు అధిక సంఖ్యలో గుమ్మిగూడటం, ప్రార్ధనా స్థలాలలో ఆహార పదార్ధాలు పంచడం మరియు సామ్రాణి వాడడం వంటివాటిని చెయ్య వద్దని ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసినా కొన్ని ప్రదేశాలలో ప్రజలు వాటిని బేఖాతరు చేసినట్లు తెలిసింది.

గల్ఫ్ దేశాలన్నిటిలో కల్లా 30 మిలియన్ల జనాభా ఉన్న సౌదీ అరేబియా లో మాత్రమే అధికంగా 83 , 000 కరోనా కేసులు నమోదు కాగా వారిలో 480 మంది చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది.

 

Article abstracted from RVA English website: https://www.rvasia.org/saudi-arabia-reopens-mosques

Add new comment

4 + 0 =