"శాంతి సాధన పాఠశాల " ఆధ్వర్యం లో దుప్పట్లు పంపిణి

విశాఖ అతిమేత్రాసనం , గూడెంకొత్తవీధి మండలం ఆర్వీనగర్లోని "శాంతి సాధన పాఠశాల " ఆధ్వర్యం లో సుమారు 100 కుటుంబాలకు  దుప్పట్లు పంపిణిచేశారు.

ఈ కార్యక్రమం లో "శాంతి సాధన పాఠశాల " కరస్పాండెంట్ గురుశ్రీ హ్యారి ఫిలిప్స్ తో పటు పాఠశాల విద్యార్థులు మరియు బ్రదర్స్ అనిల్, రాజ్ కుమార్ మరియు అజిత్ లు పాల్గొన్నారు.
 క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భముగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా  అరిథివలస, డేరాల , దోనుగోమాలు , చినగొండి గిరిజన  గ్రామాలను సందర్శించారు.   

ఈ సందర్భముగా గురుశ్రీ హ్యారి ఫిలిప్స్ మాట్లాడుతూ ఆదివాసీ, గిరిజనులు ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్దిలో పాలుపంచుకోవాలని కోరారు. గతంతో పోల్చుకుంటే పాఠశాలలో  సౌకర్యాలు ఎంతో మెరుగు పడ్డాయన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను చక్కగా చదివించాలని సూచించారు. 

కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు క్రిస్మస్ కేక్ లను, పండ్లను  ప్రజలకు పంచి పెట్టారు. 

Add new comment

7 + 0 =