వైద్యం అందని నిరుపేదల కోసం KOMISO వైద్యశాల

కొరియన్ మిషనరీలు కంబోడియాలో పేద ప్రజల కోసం వైద్యశాల  ఏర్పాటు చేశారు.

నమ్ పెన్ నగరం, డాంకోర్ జిల్లా, ట్రాపాంగ్ సీలా గ్రామంలో ఫిబ్రవరి 8న "కొమిసో వైద్యశాల"ని కంబోడియా పీఠాధిపతులైన  ఒలివర్ ష్మిత్థేయుస్లర్ గారు ప్రారంభించారు.  

"వైద్య చికిత్స పొందలేని నిరు పేద ప్రజలకు ఈ క్లినిక్ నిర్మించబడిందని "ఫాదర్ జి హూన్ కిమ్, ప్రాజెక్ట్ డైరెక్టర్, RVA విలేకరులతో చెప్పారు.

దంతవైద్యుడు, జనరల్ చెకప్ మరియు పేద ప్రజలకు ఉచితంగా మందులు ఇవ్వడం వంటి ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి కొరియన్ వైద్యులు కంబోడియా మిషన్లకు వస్తున్నారని ఫాదర్ గారు తెలిపారు.

కొరియన్ మిషనరీలు అనేక సంవత్సరాల వైద్య సేవతో కంబోడియన్ ప్రజలతో సంబంధాలను ఏర్పరచుకున్నారు మరియు 2020 నుండి కొనసాగుతున్న వైద్య సేవలను అందించడానికి ఒక చిన్న స్థలాన్ని అద్దెకు తీసుకోవడం ప్రారంభించారు.

2022 ఏప్రిల్‌లో ఖైమర్ న్యూ ఇయర్ తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు ఇద్దరు వైద్యులు మరియు ముగ్గురు సిబ్బంది ఉచితంగా సేవలను అందిస్తారని కొమిసో వైద్యశాల మేనేజర్ ఈ టిటి గారు తెలిపారు.

Add new comment

6 + 9 =