విన్సెంట్ డి పాల్ సొసైటీ | పునీత అంతోని వారి దేవాలయం

for the poor
విన్సెంట్ డి పాల్ సొసైటీ  | పునీత అంతోని వారి దేవాలయం

విశాఖ అతి మేత్రాసనం, మహారాణి పేట విచారణ విన్సెంట్ డి పాల్ (Vincent De Paul) సభ్యులు క్రిస్మస్ మరియు క్రొత్త సంవత్సరం  సందర్భముగా మహారాణి పేట  "పునీత అంథోని వారి దేవాలయ" ప్రాగణంలో ఉన్న యాచకులకు, పేదవారికి  చీరలు మరియు దుప్పట్లు పంపిణి చేయడం జరిగింది. దేవాలయ ప్రాంగణం లో ఉన్న  20మంది యాచకులకు  ఉచితం గా దుప్పట్లు మరియు చీరలను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహారాణి పేట విన్సెంట్ డి పాల్ ప్రెసిడెంట్  శ్రీమతి నిర్మల మేరీ గారు, శ్రీమతి అన్నపూర్ణ గారు, శ్రీ వేపాడ రాజారావు  గారు తదితరులు పాల్గొన్నారు.

 
శ్రీమతి అన్నపూర్ణ గారు ప్రభు యేసు ప్రేమను వారికీ తెలియజేసి వారి కొరకు ప్రార్ధించారు. ప్రతి నెల విచారణ లో ఉన్న పేదవారికి, వృద్దులకు నెలకు సరిపడా బియ్యం మరియు నిత్యావసరాలకు సహాయం చేస్తున్నారు  మన మహారాణి పేట "విన్సెంట్ డి పాల్ సొసైటీ " వారు .
నిస్వార్థమైన సేవ చేస్తున్న  "విన్సెంట్ డి పాల్ సొసైటీ" (Vincent De Paul Society) వారికీ  "అమృతవాణి - రేడియో వెరిటాస్" తరుపున కృతజ్ఞతలు.

Add new comment

3 + 11 =