Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
రంజాన్ మాసం ప్రజలను దాతృత్వం వైపునకు నడిపిస్తుంది

రంజాన్ మాసం ప్రజలను దాతృత్వం వైపునకు నడిపిస్తుంది.
అనేక మతాల మధ్య అవగాహనను, సామరస్యాన్ని బలపరుచుకోవడానికి ఈ రంజాన్ మాసం ఒక మంచి అవకాశం అని శ్రీలంకలోని ముస్లిం మత పెద్దలు అభిప్రాయపడ్డారు.
దేశము మరియు యావత్ ప్రపంచము కరోనా మహమ్మారితో సతమతమౌతున్న ఈ సమయంలో, దాతృత్వము మనకు మార్గదర్శకం కావలి" అని షేక్ అబ్దుల్లా అబ్దుల్ రెహ్మాన్ ఆసియ వార్తాలు వారికి ఇచ్చిన ఒక ముఖాముఖిలో అన్నారు.
నెగోమ్బో అనే త్రైపాక్షిక వార్తాలాప కార్యక్రమములో ఈయన క్రియాశీల పాత్ర పోషిస్తున్న వ్యక్తి.
ఈ కరోనా సమయంలో ఆరోగ్య దృష్ట్యా ముస్లిం విశ్వాసులందరు తమతమ ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకోవాలని శ్రీలంక లోని ముస్లిం పెద్దలు ప్రజలను వేడుకున్నారు.
ఈ కష్టకాలంలో జాతి మత భేదాలు లేకుండా మనందరం ఒక విషయాన్ని గుర్తించాలి "కష్టంలో ఉన్నవారు ఏ మతం, ఏ కులం వారైనా, వారికి సహాయం చెయ్యాలి" అని షేక్ రెహ్మాన్ అన్నారు.
బీద వారు ఎటువంటి పరిస్థితులలో జీవిస్తున్నారో రంజాన్ మనకు నేర్పిస్తుంది.
శారీరక ఉపవాసం ద్వారా ఆహరం లేక పస్తులు ఉంటున్నవారికి దగ్గర కాగలం" అని ఆయన అభిప్రాయం పడ్డారు.
Add new comment