మొదటి బహుళ-మత ప్రార్థన గదిని ప్రారంభించిన ఢాకా విశ్వవిద్యాలయం

 ఢాకా విశ్వవిద్యాలయంబహుళ-మత ప్రార్థన గది

బంగ్లాదేశ్‌లోని ఢాకా విశ్వవిద్యాలయం లో 11 జూలై 2022 న షాంసున్నహర్ హాల్‌లో మైనారిటీ విద్యార్థుల కోసం మొట్టమొదటి బహుళ-మత ప్రార్థనా గదిని ప్రారంభమైంది.

షాంసున్నహర్ హాల్ ప్రోవోస్ట్ ప్రొఫెసర్ లఫీఫా జమాల్ మాట్లాడుతూ, మైనారిటీ విద్యార్థుల ప్రార్థనలకు స్టూడెంట్ హాల్‌లో స్థలం ఉండాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించిందని,  విశ్వవిద్యాలయం అనేది మత రహిత ప్రదేశం, ఇక్కడ అన్ని మతాల విద్యార్థులకు సమాన హక్కులు ఉంటాయి అని అన్నారు.

హాస్టళ్లలో ఉంటున్న మైనారిటీ క్రైస్తవ, హిందూ మరియు బౌద్ధ మతాలకు చెందిన విద్యార్థుల కోసం ప్రార్థన గదులను ప్రారంభించడం ద్వారా విశ్వవిద్యాలయలో మత వివక్షను అంతం చేయడానికి విశ్వవిద్యాలయం మొదటి అడుగు వేసింది. కొత్త ప్రార్థనా గదిలో క్రీస్తు, బుద్ధుడు మరియు హిందూ దేవతల చిత్రాలు ఉన్నాయి.

ఈ "భారీ విజయం" పట్ల విద్యార్థులు సంతోషిస్తున్నారు మరియు మరిన్ని విద్యా సంస్థలు దీనిని అనుసరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మోనిక్ రాయ్ అనే హిందూ విద్యార్థి మాట్లాడుతూ "మైనారిటీ విద్యార్థులకు ప్రార్థనా గదులను నెలకొల్పి మంచి నిర్ణయం తీసుకున్నందుకు అధికారులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను" అన్నారు.

ఇది మత సామరస్యానికి నిదర్శనమని ఒక కథోలిక విద్యార్థి అయిన ప్రియాంక గోమ్స్ అన్నారు

"భవిష్యత్తులో మనం క్రైస్తవుల కోసం చర్చిలు, హిందువులు మరియు బౌద్ధులకు విశ్వవిద్యాలయాలలో దేవాలయాలను చూస్తాము" అని విశ్వవిద్యాలయంలో ప్రపంచ మతాలు మరియు సంస్కృతి విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన గురుశ్రీ తపన్ రోజారియో గారు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఢాకా విశ్వవిద్యాలయం 1921లో స్థాపించబడింది, ఇందులో బాలికల కోసం ఐదు మరియు బాలుర కోసం 23 వసతి గృహాలు ఉన్నాయి

విశ్వవిద్యాలయంలో 38,000 మంది విద్యార్థులు మరియు 2,000 కంటే ఎక్కువ మంది అధ్యాపకులు ఉన్నారు. విద్యార్థుల్లో ఎక్కువ మంది మహమ్మదీయులు.

162 మిలియన్ల బంగ్లాదేశ్ జనాభాలో తొంభై శాతం మంది ముస్లింలు. హిందువులు దాదాపు 8 శాతం ఉన్నారు, మిగిలిన వారు బౌద్ధులు మరియు క్రైస్తవులు ఉన్నారు.
 

Add new comment

5 + 0 =