ముస్లిములకు అతి ముఖ్యమైన పండుగ రంజాన్.

Ramzan రంజాన్ పండుగ శుభాకాంక్షలు

ముస్లిములకు అతి ముఖ్యమైన పండుగ రంజాన్.

రంజాన్ అనే పండగ ముస్లిములకు ఎంతో ముఖ్యమైన పండుగ.  ఈ పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోని ప్రతి ఒక్క ముస్లిం ఈ పండుగను ఎంతో భక్తి శ్రద్దలతో కొనియాడుతారు. ఈ పండుగకు 40 రోజుల ముందు నుండి చిన్న పెద్ద తేడా లేకుండా అందరు కఠిన ఉపవాసం చేస్తారు. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పాచి మంచినీళ్లు కూడా ముట్టరు అంటే అతిశయోక్తి కాదు. 

సూర్యాస్తమయం తర్వాత అందరు తప్పనిసరిగా ప్రార్ధనలు చేసి అనంతరం అందరు కలిసి సహపంక్తిలో భోజనం చేస్తారు. దీనినే ఇఫ్తార్ విందు అని అంటారు. ప్రార్థనలలో వారు తమ పవిత్ర గ్రంథమైన ఖురాన్ ను చదివి ప్రార్ధనలు చేస్తారు.

మొహమ్మద్ ప్రవక్తకు గాబ్రియేల్ దూత ఖురాన్ గ్రంధాన్ని ఇచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ పండుగను కొనియాడుతారు. 

ఈ సందర్భంగా అందరు ముస్లిం సహోదరి సహోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు 

Add new comment

7 + 1 =