మాతృ భాషా దినోత్సవం

"మాతృ భాషలోనే భావ వ్యక్తీకరణం సుసాధ్యం" అని అమృతవాణి  డైరెక్టార్ గురుశ్రీ సుధాకర్ గారు విశ్లేషించారు. 
సికింద్రాబాద్ వాణీ నిలయంలో  మాతృ భాషా దినోత్సవ సందర్భంగా -  "రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం"  వారు ఏర్పాటు చేసిన భావ వ్యక్తీకరణ అవగాహనా సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు. 
ముఖ్య అతిధిగా సినీ దర్శకులు శ్రీ కొండూరి సారథిగారు మాట్లాడుతూ పుట్టి పెరిగిన పరిసరాలు, అనుభూతియే భాషను అతి సహజంగా సరళంగా నేర్పగలుగుతాయని, అదే మాతృ భాషలోని ఔశిష్ట్యం అని చెబుతూ ఒక భావాన్ని పరిపూర్ణంగా సూటిగా చెప్పగలిగించే భాష మాతృ భాష .అంత కాన్నా మించిన భావ వాహిక మరొకటి లేదని వారు ,తన  సినీ సన్నివేశాల నుంచి కొన్ని ఉదాహరించారు. 
  ప్రధాన వక్తగా పాల్గొన్న సాహితీ వేత్త , విశ్రాంత డిగ్రీ కళాశాల ప్రింసిపాల్ - డా:డి.బెర్నార్డ్ రాజు పుట్టుపూర్వోత్తరాలు వివరిస్తూ , మాతృ భాష ఆరాధనీయం ఐనా,  మన వారు భాషకు సరస్వతి అని పేరుపెట్టడంలోనే దాని ఆంతర్యం దాగిఉందని, అందరూ అన్ని భాషల్ని గౌరవించాలని , కేవలం, మన పూర్వీకుడు అమ్రసిమ్హుడు భాషకు ఇచ్చిన నిర్వచనాన్ని -గీర్ , వాక్, వాణీ,భారతీ, భాషా, సరస్వతీ - అనే పదాలు - భాషకు ఇచ్చిన పదాలుగా  శాబ్దికంగా , ఆర్ధికంగా విభజన చేసి విశదీకరించారు.

Add new comment

4 + 7 =