మన సహాయం అందేవిధంగా మనం అడుగులు ముందుకు వెయ్యాలి - గురుశ్రీ రాజు అలెక్స్

pogromహైదరాబాద్ లోని దళిత ప్రతినిధులు, క్రైస్తవ మరియు కథోలిక సంఘాలకు చెందిన ప్రతినిధులు

మణిపూర్ లో దళితులపై, క్రైస్తవులపై మరియు క్రైస్తవ దేవాలయాల పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా దళితులు నిరసనలు తెలుపుతున్నారు. మణిపూర్ లోని దళితుల పరిస్థితిని గురించి, వారికి కావలసిన కావలసిన సహాయం గురించి హైదరాబాద్ లోని దళిత ప్రతినిధులు, క్రైస్తవ మరియు కథోలిక సంఘాలకు చెందిన ప్రతినిధులు 17 మే 2023 న అబిడ్స్ లో సమావేశమయ్యారు.

ఈ సమావేశం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యింది. కార్యక్రమానికి తెలంగాణ సాలిడారిటీ ఫోరమ్, ఫెడరేషన్ అఫ్ తెలంగాణ చర్చిస్ (FTC ), తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ అఫ్ చర్చిస్ ( TSFC ) మరియు తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య (TCBC ) నుండి సభ్యులు పాల్గొన్నారు. TCBC లోని క్రైస్తవ సమైక్యత మరియు అంతర్మత సమాలోచన సేవా విభాగ డైరెక్టర్ గురుశ్రీ కొండవీటి అంతయ్య గారి నేతృత్వంలో ఈ కార్యక్రమంలో జరిగింది.

ఈ సందర్భంగా TCBC ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గురుశ్రీ రాజు అలెక్స్ గారు మాట్లాడుతూ మణిపూర్ లో బాధలు పడుతున్న వారికి మన సహాయం అందేవిధంగా మనం అడుగులు ముందుకు వెయ్యాలని అన్నారు.

బాధితులకు మద్దతుగా అందరు గళాన్ని కలిపి నినదించాలని పాస్టర్ ప్రశాంత్ బాబు గారు అన్నారు.

ఇది ఉన్నత వర్గాలకు మరియు వెనుకబడిన వర్గాలకు మధ్య జరుగుతున్న కలహం లా మీడియా దీనిని తప్పుగా చూపిస్తుందని, నిజం బైటకు వచ్చేవరకు అందరు కలిసి పోరాడాలని డాక్టర్ కుమార్ గారు పిలుపునిచ్చారు.

మొహమ్మద్ ప్రవక్త హింసకు పాల్పడకూడదని, సోదరభావం కలిగి ఉండాలని ప్రభోదించారని, కనుక మన హృదయాలను ఏకం చేసి బాధితులకు మన సంఘీభావాన్ని తెలపాలని ప్రొఫెసర్ అన్వర్ అన్నారు.

మణిపూర్ లో ఉన్న దళితులకు ఆహరం, మందులు, వస్త్రాలు మరియు నిత్యావసర వస్తువులు అందించడానికి మరియు గృహాలను కోల్పోయిన వారికి నివాస స్థలాలను చూపించడానికి, తప్పుడు ప్రచారాన్ని అరికట్టడానికి జాతీయ మైనారిటీ సంఘం మణిపూర్ వెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైన సలహాలను మరియు సూచనలను అందించిన వారందరికి గురుశ్రీ కొండవీటి అంతయ్య గారు కృతఙ్ఞతలు తెలిపారు.

Add new comment

14 + 2 =