మతాలు యుద్ధాలను కోరవు : పోప్ ఫ్రాన్సిస్

మతాలు యుద్ధాలను కోరవు : పోప్ ఫ్రాన్సిస్

ప్రపంచ శాంతి కోసమై ప్రార్ధన చెయ్యడానికి సంత్ అజీడివో సంఘం వారు ఏర్పాటు చేసిన సర్వ మత ప్రార్ధనా సమ్మేళనం  రోము నగరం లో జరిగింది. "ఎవ్వరూ తమంతట తాముగా రక్షింపబడలేరు. శాంతి మరియు సోదరభావం" అనే ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది. రోము నగరంలో ఉన్న వేరు వేరు మతాలకు చెందిన ప్రార్ధనా స్తలాలలో ప్రార్ధనలు జరిగాయి. యూదులు తమ ప్రార్ధనా మందిరాలలో ప్రార్ధించగా ముస్లిములు, బౌద్ధులు క్యాపిటలైన్ ప్రదర్శన శాలలో ప్రార్ధనలు జరిపారు.

ఫ్రాన్సిస్ పోప్ గారు మరియు కాన్స్టాంటినోపుల్ క్రైస్తవ పెద్ద అయిన మొదటి బర్తలోమి గారు కలిసి సంత మరియా బసిలికా లో ప్రార్ధనలు జరిపారు.

పఠనాల అనంతరం పోప్ గారు క్రీస్తు శ్రమలను గూర్చి ధ్యానిస్తూ, క్రైస్తవులుగా మనందరమూ శోధనకు అతీతులం కాదని, సిలువ శ్రమలకు ముందు క్రీస్తు ప్రభువు కూడా తనను తాను 
రక్షించుకోవడానికి శోధింపబడ్డారని గుర్తు చేసారు. 

కొద్ది సమయం మౌన ప్రార్ధన అనంతరం మొదటి బర్తిలోమి గారు ప్రార్ధన ఉద్దేశాలను ముందుకు నడిపించారు.

మొదటి బర్తిలోమి: 
"హింస, యుద్ధము మరియు ఉగ్రవాదం వల్ల గాయపడిన ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాలను మరియు మన నేత్రాలను ఆ దేవుని వైపు త్రిప్పుదాం."

ప్రతి ఒక్క ప్రార్ధనా ఉద్దేశానికై ఒక క్రొవొత్తిని పీఠం ముందు వెలిగించారు.

చివరిగా పరలోక ప్రార్ధనానంతరం ఫ్రాన్సిస్ పోప్ గారు, మొదటి బర్తలోమి గారు మరియు అంజిలికాన్ అగ్ర పీఠాధిపతి అయిన  ఇయన్  ఎర్నెస్ట్ గారు కలిసి సమిష్టి ఆశీర్వాదం ఇచ్చారు. 

అనంతరం బసిలికా వెలుపల ఇటలీ అధ్యక్షుడైన సెర్గియో గారు పోప్ గారిని మరియు బర్తలోమి గారిని పలకరించారు. రోము నగర మేయర్ ను కూడా వారు కలిశారు. బౌద్ధ మతం, సిక్కు మతం, హిందూ మతం, యూదా మతం మరియు ముస్లిము మతానికి చెందిన ప్రతినిధులతో కొద్ది సేపు ముచ్చటించారు. 

యుద్ధము మరియు వైరుధ్యాలు అంతము కావాలని అన్ని మతాలు పట్టుదలతో ప్రార్ధించాలని పిలుపునిచ్చారు.

శాంతి మరియు సోదరభావాన్ని పెంపొందించడానికే మతాలు ఉన్నది అని పోప్ గారు హితవు పలికారు.

పోప్ ఫ్రాన్సిస్: 
 
"శాంతి సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి అనేక మతాలకు సంబంధించినవాళ్లమైన మనం ఇక్కడ సమావేశం అయ్యాం. దీని ద్వారా మనం హింసకు, యుద్ధాలకు వ్యతిరేకులమని స్పష్టమౌతుంది". 

పోప్ గారి సందేశం తర్వాత కరోనా వల్ల తమ ప్రాణాలను వీడిన వారికోసం కొన్ని నిముషాలు నిశబ్దం పాటించారు. 

సమావేశం చివరన అందరు ప్రతినిధులు శాంతి మరియు సోదర భావాలను పెంపొందించేందుకు కృషి చేస్తామని ఒక వాగ్దాన ప్రతి పై సంతకాలు చేసారు.

Add new comment

14 + 2 =