మతసామరస్యాన్ని చాట్టిన ఇఫ్తార్ విందు

19 ఏప్రిల్ 2022న హైదరాబాద్ లోని హెన్రీ మార్టిన్ ఇన్స్టిట్యూట్ లో ఒక వినూత్న కార్యక్రమం జరిగింది. ముస్లిం సహోదరులకు పవిత్ర మాసమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు చేసుకునే ఆచారం వారికి ఉంది. ఐతే స్టూడెంట్స్ అఫ్ ఇస్లామిక్ ఆర్గనైజషన్ (SIO ) వారు ఈ విందుని ప్రత్యేక విధంగా జరిపారు. మత సామరస్యాన్ని చాటుతూ ఈ విందుకు క్రైస్తవ మరియు హైందవ సహోదరులను ఆహ్వానించారు.

సన్ నిరన్కరి మిషన్ నుండి శ్రీ గోరలాల్ జి గారు హైందవ సహోదరులకు ప్రాతినిధ్యం వహించగా, అంతర్మత సమాలోచన సేవ కార్యదర్శి గురుశ్రీ కొండవీటి అంతయ్య గారు కథోలిక సమాజానికి ప్రాతినిధ్యం వహించగా  మరియు చర్చి అఫ్ సౌత్ ఇండియా పాస్టర్ జేసన్ గారు ఇతర క్రైస్తవ సంఘాలకు ప్రాతినిధ్యం వహించారు . 

ఈ సందర్భంగా గురుశ్రీ కొండవీటి అంతయ్య గారు మాట్లాడుతూ ఇతర దేశాలలో కనిపించని ఒక విశిష్టత భారతదేశంలో ఉందని, అదే భిన్నత్వంలో ఏకత్వం అని, ఏ మతమైనా ప్రేమ, సేవ వంటి మంచి విలువలనే చెప్తుందని, ఏ మతము హింసను ప్రోత్సహించదని అన్నారు. ప్రతి మతంలోకూడా ఉపవాస ప్రక్రియ ఉంటుందని, అది మనలను దేవునికి దగ్గరగా చేస్తుందని అన్నారు. కనుక అందరం సహోదర భావంతో కలిసి మెలసి జీవిస్తే ఈ ప్రపంచం ఎంతో సుందరంగా మారుతుందని చెప్పారు. 

కార్యక్రమంలో చివరిగా అందరు ఇఫ్తార్ ప్రేమ విందులో పాల్గొని సహోదరభావాన్ని చాటిచెప్పారు.

Add new comment

3 + 0 =