ఫ్రాన్సిస్ పాపు గారి ప్రార్ధనా పిలుపునకు సానుకూలంగా స్పందించిన ఇండోనేషియా ముస్లిములు

Indonesian Muslimsసానుకూలంగా స్పందించిన ఇండోనేషియా ముస్లిములు

ఫ్రాన్సిస్ పాపు గారి ప్రార్ధనా పిలుపునకు సానుకూలంగా స్పందించిన ఇండోనేషియా ముస్లిములు

మే 14 , గురువారం నాడు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రపంచమంతా కలసి ప్రార్ధించాలని ఫ్రాన్సిస్ పాపు గారు ఇచ్చిన పిలుపునకు ఇండోనేషియాలోని ముస్లిం పెద్దలు  సానుకూలంగా స్పందించారు.

ప్రపంచములోనే అత్యధిక ముస్లిములు ఉన్న దేశం ఇండోనేషియా అని, పాపు గారి పిలుపు మేరకు వారందరు ప్రార్ధించడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మకస్సర్ లోని విశ్వవిద్యాలయ మొక్ ఖాసీం మథర్ అన్నారు.

పాపు గారి పిలుపునకు  ఇండోనేషియా ముస్లిములు సానుకూలంగా స్పందించారని ఆసియ న్యూస్ ఒక నివేదిక లో పేర్కొంది.

ఈ ప్రార్ధనలో పాల్గొనడం ద్వారా కష్ట సమయాలలో సహోదర భావం మెరుగుపడుతుందని హిదయతుల్లాహ్ విశ్వవిద్యాలయ సహా అధ్యక్షులైన ఆమనీ  లుబీస్ అన్నారు.

ఇండోనేసియాలో ఇప్పటివరకు 14000 మంది కరోనా బారిన పడగా, 2400 మంది ఆసుపత్రులలో ఇంకా చికిత్స పొందుతున్నారు. కాగా సుమారు 1000 మంది మృత్యువాత పడ్డారని అంచనా.
 

Article abstracted from RVA English website : https://www.rvasia.org/index.php/indonesian-muslims-pray-pope-francis-may-14

Add new comment

12 + 3 =