ప్రాంతీయ దళిత పాలసీని గూర్చి చర్చా వేదిక

23 ఫిబ్రవరి 2022 వ తేదీన ఏలూరు మేత్రాసనం, సెయింట్ జోసఫ్స్ దంత వైద్య కళాశాలలో, దళిత విభాగం వారు చర్చావేదికను నిర్వహించారు.

TCBC ప్రాంతీయ దళిత విభాగ కార్యదర్శి డాII కలివెల ఎలిషా కుమార్ గారు తెలుగు శ్రీ సభలో దళిత పాలసీని ఏ విధంగా రూపొందించారో వివరించారు.మహా ఘన పొలిమేర జయరావు తండ్రిగారు ,TCBC దళిత విభాగ అధ్యక్షులవారు దళిత పాలసీని రూపొందటానికి వారు చేసిన కృషిని , సహకారాన్ని ఎలిశా కుమార్ గారు అభినందించారు.ఈ దళిత పాలసీని తెలుగు కాథోలికులు ఆచరించే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

దళిత పాలసీని రూపొందటానికి సహకరించిన ఎలీషా కుమార్ గారు TCBC దళిత విభాగ కార్యదర్శిని, దళితుల ఆశయాలకు జాతీయ స్థాయిలో ఎంతో శ్రమించిన శ్రీ.గల్లేల స్లీవ గారిని ,శ్రీ అబ్రహాం గారిని ,శ్రీ నంది జోసఫ్ గార్లను మహా పూజ్య జయరావు తండ్రిగారు అభినందించారు

Add new comment

1 + 18 =