ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న నిర్వహించబడుతుంది. చట్టపరంగా ఎలాంటి వివక్షత, తారతమ్యం లేకుండా ప్రజలందరికి సమన్యాయం జరగాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవం జరుపుకుంటారు.
ప్రస్తుత రోజులలో సామాజిక న్యాయం అందని ద్రాక్షగానే మిగిలింది.   అధికారం లోకి వస్తున్న వారందరు .. ఆ స్ఫూర్తిని మరుస్తున్నారు. కోటి రూపాయల విలాసవంతమైన కార్లు కొనుక్కోవడానికి కోట్ల రూపాయల రుణాలు ఇచ్చే బ్యాంకులు.. ఒక ఎకరం భూమి ఉండి.. తన రక్తాన్ని చెమటగా మార్చి పంట పండించి పదిమంది కడుపు నింపే రైతన్నకు లక్షరూపాయల రుణం ఇయ్యని బ్యాంకుల కోకొల్లలు. మన దేశంలో ఇలాంటి  దుర్మార్గ పరిస్థితి ఉంది. సమాజంలో ఉన్న సంపదంతా ఆదిపత్య వర్గాలకు, బడా బాబులకు వడ్డించిన విస్తరిలా పంచుతున్నారు. పేదోడు మాత్రం పేదోడిగానే ఉండిపోతున్నాడు.

Add new comment

1 + 4 =