ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని కొనియాడిన ఢిల్లీ అగ్రపీఠం

ఢిల్లీ అగ్రపీఠం, బిషప్ హౌస్ కమ్యూనిటీ సెంటర్‌లో, జాతీయ కతోలిక పీఠాధిపతుల సమాఖ్య వారి సహకారంతో వలస మరియు శరణార్థుల  కొరకు సెప్టెంబర్ 25న ఈ కార్యక్రమం నిర్వహించారు .

వీరికోసం దివ్యబలిపూజ సమర్పించగా దాదాపు 200 మంది వలసదారులు మరియు 20 మంది శరణార్థులు పవిత్ర దివ్యసమారాధనలో పాల్గొన్నారు...
 ప్రపంచ వలసదారులు మరియు శరణార్థుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం జరుపుకుంటారు. ఈ సంవత్సరం అది సెప్టెంబర్ 25 న.

మేత్రాసన పాస్టోరల్ కౌన్సిల్, సెక్రటరీ డాక్టర్ డైసీ పన్నా గారు శరణార్థుల దినోత్సవ   ప్రాముఖ్యతను మరియు పోప్ ఫ్రాన్సిస్ సందేశాన్ని తెలుపుతూ ప్రసంగించారు.

ఢిల్లీ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య అనిల్ టి కౌటో గారు మాట్లాడుతూ దేశంలో రెండవ అతిపెద్ద వలస జనాభాను కలిగి ఉంద ఢిల్లీ అని తెలిపారు.

పూట గడవడమే కష్టంగా ఉన్న నిరుపేదల పట్ల అగ్రపీఠాధిపతుల వారు ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రతి క్రైస్తవుడు పేదలకు సహాయం చేయాలని,వారి పట్ల ఉదారంగా ఉండాలని పీఠాధిపతి అన్నారు.

వలసదారులకు అండగా నిలిచి వారి తక్షణ అవసరాలకు సహాయం చేస్తుందని కూటో చెప్పారు.
 

Add new comment

3 + 7 =