ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం

  • ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం

    అంతర్జాతీయ పౌర రక్షణ సంస్థ (ICDO- International Civil Defense Organization) జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని 1990 లో ఏర్పాటు చేసింది.
    1990 నుంచి ప్రతీ సంవత్సరం మార్చి 1 న ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం (World Civil Defense Day) ను జరుపుకుంటారు. 1 మార్చి 1972 న ICDO రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇది అంతర్-ప్రభుత్వ సంస్థ (Intergovernmental Organization) యొక్క హోదాను సాధించింది. దీనిని స్థాపించిన వారు  ఫ్రెంచ్ సర్జన్ జనరల్ జార్జ్ సెయింట్-పాల్ (George Saint-Paul). ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవా నగరం లో ఉంది.

    ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం  నాడు సామాన్యులకు అన్ని విపత్తుల్లో రక్షణ కల్పించే రక్షణ దళానికి కృతజ్ఙతలు తెలుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భూకంపం, అగ్ని విపత్తు వంటి ఉపద్రవాలు సంభవించినా  ముందువరసలో మన  రక్షణ దళం ఎప్పుడూ ఉంటుంది . వారందరికీ కృతజ్ఙతలు తెలుపుకోవడం మన బాధ్యత.

Add new comment

1 + 4 =