తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు 

Festivalసంక్రాంతి శుభాకాంక్షలు

రెండు తెలుగు రాష్ట్రాలే కాక దక్షిణ భారతదేశమంతటా సంబరంగా జరుపుకునే పండుగ సంకాంతి. 

పల్లె ప్రజలు ఆనందోత్సవాలతో 3 రోజులపాటు ఈ పండుగను జరుపుకుంటారు. ఇది ధనుర్మాసంలో వస్తుంది. అన్ని పండుగలు తిథి ఆధారంగా జరుపుకుంటే, సంక్రాంతి మాత్రం సూర్యగమనం ఆధారంగా జరుపుకుంటాం. సంక్రాంతి నాడు సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణంలోకి ప్రవేశించేటప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం. అనగా మకర రాశిలోకి ప్రవేశించటం జరుగుతుంది. సంక్రాంతి ఉత్సవాలను కొందరు నెలరోజులపాటు జరుపుకుంటారు.

          దక్షిణ భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ 3 రోజులను భోగి, మకర సంక్రాంతి, కనుమ పేర్లతో పిలుస్తారు.

1. మొదటి రోజు ( భోగి ) :  భోగి అనే పదం భుజ్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. ఆ రోజున తెల్లవారు జామున భోగి మంటలు వేస్తారు. శీతాకాలంలో పేరుకున్న చెత్తను అగ్నిలో కాల్చేవేయటమే భోగి. ఇలా చేయటం వల్ల దురదృష్టాలు తొలగిపోతాయని నమ్మకం. సంక్రాంతిలో నెల రోజుల నుండి చేసిన గొబ్బెమ్మలను పిడకలు చేసి భోగి మంటలలో వేస్తారు. రంగు రంగుల ముగ్గులు వేయటం, పాలు పొంగించడం చేస్తారు. సాయంత్రం బొమ్మల కొలువులు పెడతారు. చిన్న పిల్లలకు రేగుపండ్లు, పూలను తలపై పోస్తారు. ఇలా చేయటాన్ని భోగిపండ్లు పోయటం అని అంటారు.

          ఇది రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భోగ భాగ్యాలతో ఎప్పటికీ ఇలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం, పాలు కలిపి వండిన నైవేద్యంతో ఇంద్రుణ్ణి, విష్ణువుని పూజిస్తారు.

2. రెండవ రోజు ( మకర సంక్రాంతి ) :  క్రాంతి అనే పదానికి సంస్కృతంలో ముందుకు జరగటం అని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి కదలటం వల్ల మకర సంక్రాంతి అని పిలుస్తారు.

          అయ్యప్ప దీక్ష చేసేవారు 40 రోజుల తరువాత అయ్యప్పను, మకర జ్యోతిని కూడా ఈ రోజే దర్శించుకుంటారు.

»    ఈ రోజు గాలి పాటలు ఎగుర వేయటం, పందాలు కాయటం చేస్తారు.
»    ఆడవారు ముగ్గులు వేయటం, ముగ్గుల పోటీలు జరుపుకోవటం చేస్తారు.
»    ఈ పండుగరోజు ధాన్యం, వస్త్రాలు, నువ్వులు, దుంపలు, చెరుకు దానం చేస్తారు.
»    స్త్రీలు పసుపు, కుంకుమ, నువ్వుల వంటలు, వస్త్రాలు, వెన్న ఇతరులకు ఇవ్వటం ద్వారా సకల సంపదలు పొందుతారని వారి నమ్మకం.

3. మూడవ రోజు ( కనుమ ) :  ఇది సంక్రాంతి చివరి రోజు, నెల రోజుల సంక్రాంతి ఉత్సవాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఈ రోజున పశువులను లక్ష్మి స్వరూపాలుగా భావించి, అందంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయటం వాళ్ళ ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని నమ్మకం. ఎద్దుల పందాలు, కోడి పందాలు కూడా ఈ రోజున నిర్వహిస్తారు. సంక్రాంతిని సాగనంపడానికి ఈ రోజున రథం ముగ్గులు కూడా వేస్తారు. ఈ రోజుతో సంక్రాంతి ముగుస్తుంది. 

Add new comment

2 + 5 =