తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య వార్షిక సమావేశం

హైదరాబాద్‌ అగ్రపీఠం, పునీత యోహాను ప్రాంతీయ గురు విద్యాలయము నందు సెప్టెంబర్ 12, 2022న తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య (FTC) వార్షిక కమిటీ సమావేశం జరిగింది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన చర్చిల బిషప్‌లు మరియు ప్రధాన క్రైస్తవ శాఖల అధిపతుల సుమారు 35 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు.

నూతనంగా ఎన్నికైన కార్డినల్ మహా పూజ్య. పూల అంథోని గారిని సమాఖ్య సభ్యులు, చర్చిల అధిపతులు సత్కరించారు మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ఒక తెలుగు వారిని కార్డినల్ స్థాయి కల్పించడం తెలుగువారందరు హర్షించదగిన విషయం అని తెలిపారు.    

ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చిస్ అధ్యక్షులు మరియు మెదక్‌ సి.ఎస్‌.ఐ బిషప్ డాక్టర్ సోలమన్ రాజు గారు అధ్యక్షత వహించగా, నెల్లూరు పీఠకాపరి,టి.సి.బి.సి అధ్యక్షులు మహా పూజ్య.డాక్టర్ మోసెస్ డి ప్రకాశం గారు సభకు స్వాగతం పలికారు. 

మునుపటి సమావేశ విషయాలను సభ చర్చించి సభ్యులు ఆమోదించారు. 

తెలుగు రాష్ట్రాలలో తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్యని బాగా ప్రసిద్ది , ప్రభావవంతంగా మార్చడానికి ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సంఘాల సమాఖ్య (APFC) / తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ సంఘాల సమాఖ్య (TSFC) వారి జోనల్/జిల్లా స్థాయి యూనిట్లను ఏర్పాటు చేయాలని , స్థానిక స్థాయిలో తరచుగా సమావేశాలు నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించబడింది.

నేషనల్ కౌన్సిల్ ఫర్ దళిత్ క్రిస్టియన్స్ (ఎన్‌.సి.డిసి) సభ్యులు షెడ్యూల్ కులంలో క్రైస్తవులకు సమాన హోదా కల్పించడంపై సుప్రీంకోర్టు కేసుకు సంబంధించి తాజా పరిణామాలపై సమావేశానికి వివరించి, దళిత క్రైస్తవులకు అనుకూలంగా కేసు గెలవడానికి అందరూ తమ వంతు సహాయ సహకరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. 

అక్టోబర్ 9, 2022ని ప్రార్థన మరియు ఉపవాస దినంగా పాటించాలని తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య నిర్ణయించింది.

కథోలిక మరియు మైనారిటీ విద్యాసంస్థలు పరిస్థితులను మరియు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రాల పాస్టర్లకు అందే గౌరవవేతనాల గురించి క్లుప్తంగా చర్చించారు.
గురుశ్రీ  డా.ఆంథోనిరాజ్ తుమ్మా గారు రూపొందించిన "ది ఎక్యుమెనికల్ జర్నీ - మైల్‌స్టోన్స్ ఇన్ ద టూ డికేడ్స్ (2001-2021)"  ప్రచురణ తుది ముసాయిదాను తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య ఆమోదించి,1000 కాపీలను ముద్రించాలని నిర్ణయించింది.

APFC (ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సంఘాల సమాఖ్య ) మరియు TSFC  (తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ సంఘాల సమాఖ్య) సభ్యులు కార్యకలాపాల మరియు కార్యాచరణ ప్రణాళికను సమీక్షించారు.

కార్డినల్ మహా పూజ్య. పూల అంథోని గారి ప్రార్థన మరియు ఆశీర్వాదంతో సమావేశం ముగిసింది అని తెలుగు ప్రాంతీయ క్రైస్తవ ఐక్యతా సేవా విభాగ కార్యదర్శి గురుశ్రీ కొండవీటి అంతయ్య గారు తెలిపారు .
 

Add new comment

6 + 9 =