తెలుగు కతోలిక వేదశాస్త్ర సమాఖ్య 8వ సదస్సు

హైదరాబాద్ అగ్రపీఠం, జ్యోతిర్మయి సంస్థ భవనం నందు తెలుగు కతోలిక పీఠాధిపతుల సమాఖ్య వారు కతోలిక సిద్ధాంత మరియు వేదశాస్త్ర సమాఖ్య విభాగం సెక్రెటరీ గురుశ్రీ పాపయ్య గారు తెలుగు శ్రీసభలో సేవలందిస్తున్న గురువులకు, మఠ కన్యలకు రెండు రోజుల సదస్సు సెప్టెంబర్ 28,29 2022 న నిర్వహించారు.

ఫ్రాన్సిస్ గారు తలపెట్టిన “సినడ్ అండ్ సినడాలిటీ " అను అంశం ఆధారంగా ఈ సదస్సు జరిగింది.  

సుమారు 30 మంది ఈ కార్యక్రమం లో  పాల్గొనారు. మొదటి రోజు కార్డినల్ మహా పూజ్య పూల అంతోని గారు ముఖ్య అతిధిగా పాల్గొని  శ్రీసభలో ప్రస్తుతం ఉన్న వివిధ సమస్యలను సభ్యులకు తెలియజేస్తూ, పరిష్కారం వైపు అడుగులు వేయాలని కోరారు. 

విశాఖ అగ్రపీఠాధిపతులు, వేదశాస్త్ర విభాగం అధ్యక్షులు మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ తండ్రి గారు ఆరోగ్య సమస్యల రిత్యా సభకు హాజరు కాలేకపోయారు.

గురుశ్రీ పాపయ్య గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

Add new comment

1 + 4 =