చర్చిలలోకి ఇతర మతస్తులు వెళ్లవచ్చా?

church entry

చర్చిలలోకి ఇతర మతస్తులు వెళ్లవచ్చా?

క్రైస్తవుల్లో ఎవరిని అడిగినా వారికీ విశ్రాంతి దొరికే చోటు,వారి కష్టాలును సంతోషాలుగా మార్చే చోటు, వారి కన్నీళ్లను ఆనందబాష్పలుగా మార్చే చోటు, వాళ్లకి కావల్సినది అడిగితే దొరికే చోటు ఒకటే అని చెపుతారు.అదే దేవుని ఆలయం(Church) ."భారముచే అలసి సొలసిన సమస్త జనులారా నా చెంతకు రండి మీకు విశ్రాంతినోసెగెదను" అని ప్రభువు చెప్పారు కదా? మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు.

దేవుని ఆలయం లో ప్రవేశించాలంటే డిక్లరేషన్లూ ఇవ్వవలసిన అవసరంవుందా?
రోమన్ క్యాథలిక్‌లకు వాటికన్ సిటీలోని సెయింట్  పీటర్స్ బసిలికా అత్యంత పవిత్రమైన ప్రార్థనా మందిరం. ఈ ఆలయము (Church)లోకి ఎవరైనా ప్రవేశించవచ్చు .అయితే చర్చి నిబంధనలనుసారం నడచుకోవాల్సి ఉంటుంది.ఎక్కడ  ఎలాంటి డిక్లరేషన్లూ అవసరం లేదు. అన్ని కాథోలిక దేవాలయంలలో ఇదే విధంగా ఉంటుంది.మన దేశం లో కూడా ప్రతి చర్చి లో ఇటువంటి నిబంధనలే ఉంటాయి.
ప్రభు క్రీస్తు జన్మ స్థలంగా అయినటువంటి బెత్లెహామ్ నగరం కూడా  క్రైస్తవులకు  పవిత్రమైనదే. దీన్ని ముస్లింలు, యూదులు కూడా పవిత్రంగానే భావిస్తారు. ఏ మతం వారైనా ఇక్కడి చర్చిలను సందర్శించవచ్చు. ఇక్కడ  ఎలాంటి మతపరమైన నిబంధనలు ఉండవు.

2014లో చరిత్రలో తొలిసారిగా క్రైస్తవులు, యూదుల, ముస్లింల సంయుక్త ప్రార్థనను వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్ నిర్వహించారు.

అయితే కాథలిక్ దేవాలయంలో  ఇచ్చే అప్ప, ద్రాక్షారసం (రొట్టె, ద్రాక్షరసాన్ని)  అర్హత కలిగిన రోమన్ క్యాథలిక్‌లకు మాత్రమే ఇస్తారు. ప్రొటెస్టెంట్‌ల చర్చిలలో దేవుని నమ్ముకొని ,బాప్తిసం తీసుకున్న వారికీ ఇస్తారు.

 

M.kranthi swaroop
Broadcast Producer
Radio Veritas Asia Telugu

 

Add new comment

5 + 2 =