క్రైస్తవ సమైక్యత కోసం ప్రత్యేక వారం 2023

వివిధ శాఖలుగా విడిపోయి సువార్త సేవలు చేస్తున్న క్రైస్తవ శాఖల మధ్య ఐక్యత నెలకొల్పటానికి ఎన్నో మార్గాలలో అనాదిగా కతోలిక శ్రీసభ ప్రయత్నం చేస్తునే ఉంది. 

ప్రతి సంవత్సరం పాపు గారు మరియు ప్రపంచ క్రైస్తవ సంఘాల సమాఖ్య క్రైస్తవ ఐక్యతా వారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక ధ్యానాంశాన్ని ఎంపిక చేసి, దాని ఆధారంగా కలసి ధ్యానించి ఐక్యత కొరకు ప్రార్థించమని విశ్వ క్రైస్తవులను ఆహ్వానిస్తారు. 

"మంచిని చేపట్టుడు. న్యాయమును జరిపింపుడు" అను అంశం ఆధారంగా 2023 జనవరి 18-25 వరకు ప్రపంచ నలుమూలల క్రైస్తవ ఐక్యత వారం ప్రార్ధనలు నిర్వహించబడ్డాయి.

తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య అధ్యక్షులు విజయవాడ పీఠాధిపతులు మహా పూజ్య తెలగతోటి జోసఫ్ రాజారావు గారి ఆధ్వర్యంలో, ప్రాంతీయ కార్యదర్శి మరియు వివిధ మేత్రాసన కార్యదర్శులు నిర్వహణలో మన తెలుగు పీఠాలలో క్రైస్తవ ఐక్యతా ప్రార్థనలు విజయవంతంగా జరిగాయి. 

ఆయా క్రైస్తవ సంఘ పెద్దలతో కలసి మన పీఠాధిపతులు, గురువులు, విశ్వాసులు ఐక్యత కొరకు ప్రార్థన చేశారు.

ఎంతో శ్రమించి క్రైస్తవ ఐక్యతా వారాన్ని జయప్రదం చేసిన క్రైస్తవ సంఘాల పెద్దలందరికి తెలుగు పీఠాధిపతుల మండలి క్రైస్తవ సమైఖ్యతా విభాగం ప్రాంతీయ కార్యదర్శి గురుశ్రీ అంతయ్య కొండవీటి గారు ధన్యవాదములు తెలిపారు.

Add new comment

5 + 5 =