క్రిస్టియన్ డివైన్ మెలోడీస్ 2022

సెయింట్ సిసీలియా మ్యూజిక్ అకాడమి వారి ఆధ్వర్యంలో క్రిస్టియన్ డివైన్ మెలోడీస్ CDM 2022, భక్తి గీతాల పోటీలను వరంగల్ మేత్రాసనం, హన్మకొండ, మిషన్ హాస్పిటల్, సిబిసి గ్రౌండు నందు 21, నవంబర్ 2022, న అంగరంగ వైభవంగా జరిగాయి.

ఈ పోటీలకు వరంగల్, కరీంనగర్ జిల్లాలు మరియు త్రినగరంలో ఉన్న క్రైస్తవ సంగీత కారులు పాల్గొని గీతాలాపన చేశారు.

ఈ కార్యక్రమంలో సెయింట్  సిసీలియా మ్యూజిక్ అకాడమి చైర్మన్, వరంగల్ పీఠాధిపతులు, ఖమ్మం మేత్రాసన పాలనాధికారి మహా. పూజ్య ఉడుమల బాల గారు పాల్గొని ఈ వేడుకను లాంఛనంగా ప్రారంభించారు. ఉదయం ౧౦:౩౦ గంటలకు ప్రారంభమైన ఈ వేడుక ఆహ్లాదంగా జరిగింది.

మాట ఆగిన చోట పాట మొదలవుతుందని. మనసుకు ప్రశాంతత లభిస్తుంది అని బిషప్ గారు అన్నారు

క్రైస్తవులలో శాఖపరమైన తేడాలు లేకుండా కథోలిక, బాప్టిస్ట్, CSI, ఎక్లేషియా, ఆల్ఫా ఒమేగా, మన్నా,గ్లోరియా హోసన్నా తదితర క్రైస్తవు డినామినేషన్లు అందరూ ఒక్క తాటిపైకి వచ్చి  క్రైస్తవు భక్తి గీతాలు ఆలపించడం ఆనందమని, భవిష్యత్తులో సంవత్సరానికి రెండు సార్లుయైన ఈ విధంగా నిర్వహిస్థే  అన్ని సంఘాలమధ్య మైత్రి నెలకొనబడుతుందని సందేశమిచ్చారు.

ఈ కార్యక్రమంలో 50, గ్రూపులు పాల్గొనగా. ఈ అకాడమీ కోశాధికారి మాచర్ల బెన్సన్ గారు బహుమతి గ్రహీతలను ప్రకటించడం జరిగింది

Add new comment

1 + 2 =