కోవిడ్ సెంటర్‌గా మసీదు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి ఉద్ధృతమవుతుంది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా రాష్ట్రాల్లో గుజరాత్ కూడా ఒకటి.  రోజువారీ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. హాస్పిటల్స్ మరియు ఇతర కోవిడ్ కేంద్రాలు బెడ్స్ లేక ఆక్సిజన్ అందిచలేక ఇబ్బంది పడుతున్నాయి. వడోదర నగరంలోని జహంగీర్‌పూర్ మసీదు నిర్వాహకులు, మతపెద్దలు  మసీదును కోవిడ్ కేర్ సెంటర్ మార్చి స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా మసీదు నిర్వాహకులు ఇర్ఫాన్ షేక్ మాట్లాడుతూ  ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు మసీదుకు మించిన సదుపాయాలు ఎక్కడా లేవని చెప్పారు.ఆస్పత్రుల్లో ఆక్సిజన్, పడకల కొరత ఏర్పడిందని, మసీదును కరోనా కేర్ కేంద్రంగా మార్చాలని నిర్ణయించాం. ఇలా మార్చడానికి రంజాన్ నెల కంటే ఉత్తమైంది ఏముంటుంది’ అని ఆయన పేర్కొన్నారు. మొత్తం 50 పడకలను ఏర్పాటుచేసినట్టు తెలిపారు.

Add new comment

2 + 1 =