కోవిడ్ కేర్ సెంటర్ గా కల్వరి మందిరాలు

కోవిడ్ కేర్ సెంటర్ గా కల్వరి మందిరాలు

 మన తెలుగు రాష్ట్రాలలో కరోనా మరొకసారి విజృంభిస్తున్న సమయంలో  ప్రజలకు హాస్పిటల్ లో  బెడ్స్ లేక, ఒక వైపు ఆక్సిజెన్ లేక, హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వలేక  నిస్సహాయ పరిస్థితులలో ఉన్న వారికి  దైవజనులు డా పి సతీష్ కుమార్ గారు మరోసారి  నేను వున్నాను అంటూ ముందుకు వచ్చారు. డా పి సతీష్ కుమార్ గారు కల్వరి టెంపుల్ ప్రాంగణంలో సుమారు 300 బెడ్స్ అలాగే 50 ఆక్సిజెన్ బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగినది. నిత్యం 100 కు పైగా వైద్య సిబ్బంది ఈ కోవిడ్ కేర్ సెంటర్ లో సేవలందించనున్నారు.

 క్రీస్తు ప్రభువు  ప్రేమను మాటలలోనే కాకా, పనులలో కూడా  చూపిస్తూ అలాగే  సమాజంపట్ల తన బాధ్యతను కనపరుస్తూ  ఈ "కల్వరి టెంపుల్ కోవిడ్ కేర్ సెంటర్" ను ఏర్పాటు చేయడం జరిగినది. ఇది వరకే  తెలుగు రాష్ట్రాలలో ఉన్న కల్వరి టెంపుల్ ను కోవిడ్ కేర్ సెంటర్స్ గా మార్చు తున్నట్లు దైవజనులు డా పి సతీష్ కుమార్ గారు తెలపడం మనకందరికీ తెలిసిన విషయమే.

 హైదరాబాద్ లో మియాపూర్ కల్వరి టెంపుల్ లో ఏర్పాటు చేసిన 300 పడకల  "కల్వరి టెంపుల్ కోవిడ్ కేర్ సెంటర్"ను MLC శ్రీమతి కల్వకుంట్ల కవితగారు అలాగే స్థానిక MLA గాంధీ గారు మరియు దైవజనులు డా పి సతీష్ కుమార్ గారి కుటుంబం చేతులమీద ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ప్రజలంతా స్వీయ జాగ్రత్తలు పాటించాలని, మాస్కులు, సానిటైజర్లు తప్పనిసరిగా ఉపయోగించాలని కోరారు. కరోనా పేషెంట్ల కొరకు కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా  ఉచితంగా భోజనం అందిస్తున్న దైవజనులు డా పి సతీష్ కుమార్ గారిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. సోమవారం నుండి ఇక్కడ కోవిడ్ పెషెంట్లకు చికిత్స అందించనున్నారు.
 

Add new comment

6 + 1 =