కారితాస్ బంగ్లాదేశ్ వారి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణి

దేశంలోని చలి తీవ్రతతో బాధపడుతున్న వేలాది మందికి దుప్పట్ల పంపిణీ చేసిన కారితాస్ బంగ్లాదేశ్ సామాజిక కార్యాచరణ విభాగం.

దినాజ్‌పూర్ నందు గల కారితాస్ ప్రాంతీయ కార్యాలయం 1,081 మంది పేదలకు సుమారు 1,500 దుప్పట్లను పంపిణీ చేయగా, ప్రాంతీయ కథోలిక మేత్రాసనం మరో వెయ్యి దుప్పట్లను పంపిణీ చేసింది.

దినాజ్‌పూర్, రాజ్‌షాహి మరియు సిల్హెట్ ప్రాంతాల్లో మొత్తం 3,500 దుప్పట్ల పంపిణీ చేయబడ్డాయి.

"ఈ శీతల వాతావరణంలో, పేద ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కారితాస్ బంగ్లాదేశ్ ఈ వ్యక్తులకు అండగా నిలిచింది " అని ప్రాంతీయ డైరెక్టర్ రోంజోన్ జాన్ పాల్ రోజారియో అన్నారు.

ఆయన రేడియో వెరిటాస్ ఆసియాతో మాట్లాడుతూ వృద్ధులు ఈ దుప్పట్లను తమకోసమే కాకుండా ఇంట్లో ఉన్న చిన్నారులను చలి నుండి కాపాడుకోవడానికి ఉపయోగిస్తారని తెలిపారు.
 

Add new comment

10 + 2 =