Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
ఎక్యుమెనికల్ జర్నీ ఆఫ్ చర్చెస్ ఇన్ తెలుగు రీజియన్ పుస్తక ఆవిష్కరణ
గురుశ్రీ డాక్టర్ ఆంథోనిరాజ్ తుమ్మా గారు రచించిన "ఎక్యుమెనికల్ జర్నీ ఆఫ్ చర్చెస్ ఇన్ తెలుగు రీజియన్: మైల్‌స్టోన్స్ ఇన్ టూ డికేడ్స్ (2001-2021) పుస్తకాన్ని ఉభయ తెలుగు రాష్ట్రాలలో వివిధ చోట్ల ఆవిష్కరించారు.
విజయవాడ సెయింట్ పాల్ కథడ్రల్ నందు డిసెంబర్ 14, 2022 న జరిగిన ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సంఘాల సమాఖ్య (APFC) ఐక్య క్రిస్మస్ వేడుకల్లో విజయవాడ పీఠాధిపతులు, తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య (FTC) ఛైర్మన్ మహా.పూజ్య తెలగతోటి జోసఫ్ రాజారావు గారు, పలువురు ఇతర క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో కలిసి పుస్తకాన్ని విడుదల చేశారు.
ఈ పుస్తకాన్ని తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య (FTC) వారు ప్రచురించారు.
డిసెంబర్ 20,2022న నెల్లూరు పట్టణంలో జరిగిన సింహపురి ఐక్య క్రిస్మస్ వేడుకల్లో తెలుగు కథోలిక పీఠాధిపతుల సమాఖ్య (TCBC) అధ్యక్షులు, నెల్లూరు మేత్రాణులు మహా.పూజ్య మోసేస్ దొరబోయిన ప్రకాశం గారు, నెల్లూరు రూరల్ శాసనసభ సభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మరియు ఇతర సంఘాల సభ్యులతో కలిసి ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.
హైదరాబాద్‌లోని, పీఠాధిపతుల నివాసము నందు డిసెంబర్ 21, 2022న హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు, నల్గొండ పాలనాధికారి, తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ సంఘాల సమాఖ్య (TSFC) అధ్యక్షులు, మహా పూజ్య కార్డినల్ పూల అంతోని గారు పుస్తకాన్ని విడుదల చేసి, అదే రోజు హైదరాబాద్, లాల్ బహదూర్ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఐక్య క్రిస్మస్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, ఇతర మంత్రులకు, పలువురు ప్రభుత్వ అధికారులకు, క్రైస్తవ సంఘ అధిపతులకు కార్డినల్ గారు ప్రతులను అందజేశారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో గత 20 సంవత్సరాలలో క్రైస్తవ ఐక్యత మరియు సంఘీబావం కోసం చేపట్టిన ప్రత్యేకమైన కార్యక్రమాలు, చర్యలు, విలువైన అనుభవాలు ఈ పుస్తకంలో పొందుపరచబడి ఉన్నాయి. ఇది ఎక్యుమెనికల్ మినిస్ట్రీ మరియు ఎక్యుమెనికల్ స్టడీస్‌లో ఆసక్తి ఉన్నవారికి మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది అని గురుశ్రీ డాక్టర్ ఆంథోనిరాజ్ తుమ్మా గారు తెలియచేసారు.
ఆంధ్ర ప్రదేశ్ క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్య నిర్వాహక బృందం గురుశ్రీ డాక్టర్ ఆంథోనిరాజ్ తుమ్మా గారిని అభినందిస్తూ, నూతనంగా ఆయన చేపట్టిన భారతదేశ కతోలిక పీఠాధిపతుల మండలి (CBCI) క్రైస్తవ ఐక్యతా విభాగ కార్యదర్శి హోదాలో ఇంకా ఎన్నో మైళ్ళు రాళ్ళను చేరుకోవాలని ఆశిస్తూ, దేవుని ప్రార్ధింస్తుంది.
Add new comment