ఆసియా ఫౌండేషన్ సర్వమత సమావేశం

బంగ్లాదేశ్‌,ఢాకా వెస్టిన్ ఇంటర్నేషనల్ హోటల్ నందు జనవరి 23, 2023న  ఆసియా ఫౌండేషన్ వారు  "శాంతి మరియు  సామరస్యత కొరకు" అంతర్జాతీయ సర్వమత సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశం దేశంలోని వివిధ మత పెద్దల నుండి వారు ఆసియా ఫౌండేషన్ కార్యకలాపాల ప్రభావం మరియు అనుభవాలను వినుటకు నిర్వహించడం జరిగింది.

తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి శాంతి మార్గాలను,మహిళా సాధికారత విధానాలను వారు ఈ సమావేశంలో చర్చించారు.

"ఆసియా ఫౌండేషన్ వారు మానవ హక్కుల మరియు మతాంతర కార్యకలాపాలను గిరిజన మరియు అట్టడుగున ఉన్న వారిని కుడా చేరుకుంటున్నాయి" అని గురుశ్రీ పాట్రిక్ గోమ్స్, రాజ్‌షాహి డైలాగ్ కమిషన్ కన్వీనర్ మరియు సెక్రటరీ తెలిపారు.

Add new comment

3 + 0 =