"అవి హింసకు, బానిసత్వానికి నిల్వలు": ఫ్రాన్సిస్ పాపు గారు

"అవి హింసకు, బానిసత్వానికి నిల్వలు": ఫ్రాన్సిస్ పాపు గారు

 

కష్టాలతో కడతేరుతున్న ఒక తల్లి, రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు అనుకున్న తన కొడుకు ఫోన్ చేస్తే ఆమె అందానికి అవధులు ఉండవు.

సరిగ్గా ఇదే జరిగింది మొహమ్మద్ దావూద్ యొక్క తల్లి జీవితంలో.

మొహమ్మద్ దావూద్ లిబియా లోని నిర్బంధ శిబిరంలో బంధింపబడి, హింసింపబడి, రెండు సంవత్సరాలు ప్రవాసంలో భయాందోళనలతో జీవించిన అనంతరం అక్కడినుండి విముక్తి పొంది తన తల్లిని చేరాడు.

"వారు మమ్మల్ని కొట్టేవారు, మమ్మల్ని బానిసలని తిట్టేవారు. వారు మమ్మల్ని కొట్టి శిక్షించేవారు, మాకు ఆహరం కూడా పెట్టేవారు కాదు". అని మొహమ్మద్ దావూద్ అన్నారు. మొహమ్మద్ కు అది ఒక్క శారీరక హింస మాత్రమే కాదు మాటల ద్వారా మానసిక హింస కూడా ఉండేది అని మొహమ్మద్ వాపోయాడు.

"ఎవరైనా నన్ను బానిస అని పిలిస్తే అది ఒక గట్టి చెంప దెబ్బ కంటే చాల బాధగా ఉంటుంది. అంతకు బదులు నన్ను చంపివేసినా పర్వాలేదు గని నన్ను బానిస అని అనడం నన్ను చంపడం కంటే దారుణం గా భావిస్తాను"అని మొహమ్మద్ తన ఆవేదన వ్యక్తం చేసారు.
 
మొహమ్మద్ దక్షిణ సుడాన్ లో నివసిస్తున్న ఒక విద్యార్థి. అక్కడి యుద్ధ పరిణామాల కారణంగా తన ఇంటిని కోల్పోయిన అతను, మధ్యధరా సముద్రం దాటి ఐరోపా లోనికి వెళ్ళడానికి లిబియా వచ్చాడు. లిబియా వెళ్లిన తర్వాత అక్కడి నిర్బంధ శిబిరంలో చిక్కుకొని తన ఇంటి వారితో సంభందాలు కోల్పోయాడు. అక్కడి నిర్బంధ శిబిరంలో ఎన్నో బాధలు అనుభవిస్తుండగా అక్కడి ఒక స్వచ్చంద సంస్థ నిర్బంధ శిబిరాల్లో ఉన్నవారిని విముక్తులను చేస్తూ సెప్టెంబర్ 2019 లో మొహమ్మద్ ర్వాండా నగరానికి తరలించింది. 

 
ర్వాండా నగర ప్రజలు ఎంతో మంచివారని, వారి ఆప్యాయకరమైన చిరునవ్వు ఎంతో నిర్మలంగా ఉంటుందని, వారి కళ్ళల్లో ప్రేమ, ఆప్యాయత ఉంటాయని, ఆ నగరం తన జన్మ స్థలం లా అనిపించిందని మొహమ్మద్ చెప్పారు. 

ఫ్రాన్సిస్ పాపు గారు కూడా అనేక సందర్భాల్లో లిబియా లోని నిర్బంధ శిబిరాలను తీసివేయాలని, అందులో బంధించబడిన వారిని విడిచి పెట్టాలని ఆయన కోరారు. వాటికన్ ను సందర్శించిన కొందరు శరణార్థులను కలిసిన ఆయన నిర్బంధ శిబిరాలను గూర్చి మాట్లాడుతూ "అవి హింసకు, బానిసత్వానికి నిల్వలు"అని ప్రస్తావించడం మనం గమనించవచ్చు.

Add new comment

2 + 8 =