"అందరికీ ఆహారం" అందిస్తున్న అన్నబంధు ఫౌండేషన్ - కోల్‌కతా

కోల్‌కతాలోని, కథిడ్రల్ ఆఫ్ ది మోస్ట్ హోలీ రోసరీ ఫిబ్రవరి 5న అన్నబంధు ఫౌండేషన్ మద్దతుతో "అందరికీ ఆహారాన్ని"  విచారణ గురువులు ఫ్రాంక్లిన్ మెనెజెస్ గారి చొరవ వలన  ప్రారంభించడం జరిగింది

ఈ కార్యక్రమాన్ని కోల్‌కతాలోని బుర్రాబజార్ ప్రాంతం,42 వ వార్డు  కౌన్సిలర్ మహేష్ కుమార్ శర్మ గారి సమక్షంలో  ప్రారంభించడం జరిగింది.

ఈ కార్యక్రమం ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు 140 మంది పేదలకు కేవలం 6  రూపాయలకు  మాత్రమే భోజనాన్ని అందిస్తుంది.

అన్నబంధు ఫౌండేషన్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ కిచెన్‌లో భోజనం వండుతారు మరియు "అందరికీ ఆహారం" అనే నినాదంతో ఫీడింగ్ సెంటర్‌లకు పంపిణీ చేస్తారు..

ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖులలో ఒకరిగా  రేడియో వేరితాస్ ఆసియా బెంగాలీ భాషా సేవా సమన్వయకర్త గురుశ్రీ సౌమిత్ర మఖల్ గారు పాల్గొన్నారు.

Add new comment

12 + 6 =