Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా దినోత్సవం
Monday, December 05, 2022
అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా దినోత్సవం
కష్టాల్లో ఉన్నవారిని ఎలాంటి లాభాపేక్ష లేకుండా రక్షించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వారందరి సేవను గుర్తించడం అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం (International Volunteer Day) యొక్క ముఖ్య ఉద్దేశ్యం.స్వచ్చంద కార్యకర్తలు, కమిటీలు, సంస్థలు, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి కోసం తమ వంతు కృషిని అందిస్తారు.
ప్రభుత్వ సంస్థలు, లాభేతర సంస్థలు, కమ్మ్యూనిటీ గ్రూపులు, ఎకడమిక్ ప్రవేట్ రంగంతో కలసి అభివృద్ధిలో భాగం పంచుకోవడానికి ప్రజలు, స్వచ్చంద కార్యకర్తలకు ఈ రోజు ఒక మహత్తరమైన అవకాశం వంటిది. పేదరికము , ఆకలి , రుగ్మతలు , నిరక్షరాస్యత , వాతావరణలోపాలు , మహిళలపట్ల వివక్ష వంటి సమస్యల్ని ఎదుర్కోవడం లో లక్ష్యాలు నిర్ణయించి ఆ దిశగా వలంటీర్లను ప్రోస్తహిస్తున్నారు .
Add new comment