Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
International Happiness Day
అంతర్జాతీయ సంతోష దినోత్సవము
మన జీవితాలలో సంతోషానికి ఎంత ప్రాముఖ్యత ఉందో గుర్తు చేసుకోవడానికి ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం మార్చి 20 న అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని కొనియాడుతుంది.
పేదరికాన్ని అరికట్టడం, అసమానతలను తొలగించడం, మన ప్రకృతిని సంరక్షించడం వంటి సూత్రాలను ముఖ్య లక్ష్యాలుగా గల 2015 ఐక్యరాజ్యసమితి చేసిన 17 అభివృద్ధి నిర్దేశకాలలో ముఖ్యమైన మూడు సంతోషానికి సంబంధించినవే.
ప్రపంచంలోని ప్రతి ఒక్కరు, వయో భేదం లేకుండా, అన్ని తరగతుల వారు ఈ అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని కొనియాడాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.
12 జులై 2012 న జరిగిన ఐక్యరాజ్యసమితి సామాన్య సమావేశంలో నిర్ణయించిన 66 / 281 వ సూత్రం ప్రకారం మానవ జీవితంలో సంతోషానికి ఎంత ప్రాముఖ్యత ఉందో గుర్తు చేసుకోవడానికి ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం మార్చి 20 న అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని కొనియాడుతుందని నిర్ణయించబడినది.
అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని కొనియాడాలనే ప్రతిపాదనను భూటాన్ దేశం ఐక్రాజ్యసమితి ముందుకు తీసుకు వచ్చింది. 1970 ల నుండి స్థూల జాతీయ ఉత్పత్తి కంటే స్థూల జాతీయ సంతోషానికి ప్రాముఖ్యత ఇచ్చే సూత్రాలను ఈ దేశం పాటిస్తూ ఉంది.
Add new comment