స్వర్గస్తులైన తల్లిదండ్రుల స్మరణలో సేవా కార్యక్రమాలను   ప్రారంభించిన కథోలిక కుటుంబం

Familyకథోలిక కుటుంబం

స్వర్గస్తులైన తల్లిదండ్రుల స్మరణలో సేవా కార్యక్రమాలను   ప్రారంభించిన కథోలిక కుటుంబం
         
          అవసరమైన వైద్య సామాగ్రి, గ్రామ పెద్దలకు ఆరోగ్య సంరక్షణ పరికరాలను అందించడానికి ఒక కాథోలిక  కుటుంబం సేవను ప్రారంభించింది. ఈ సేవ జనవరి 25న భారతదేశంలోని దక్షిణ గోవాలోని చించినిమ్ అనే గ్రామమైన దండేవాడోలో ప్రారంభించబడుతుంది. "బాల్తజార్ మరియు పోలీసియానా బ్రాగంజా హోమ్ హెల్త్కారే  ఎయిడ్ " సేవ అడ్జస్టబుల్ హాస్పిటల్ బెడ్, ఎయిర్ అండ్ వాటర్ మ్యాట్రెస్, వీల్‌చైర్‌ కమోడ్, అడ్జెస్టబుల్ వాకర్, సక్షన్ మెషిన్ , ఆక్సిజన్ నెబ్యులైజర్, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ మరియు సంబంధిత ఉత్పత్తులను అందిస్తుంది.

జోలిండా, జేమ్స్ మరియు రాన్సీ వారి కుటుంబాలు జనవరి 25న వారి తల్లి జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులకు నివాళులు అర్పిస్తూ" ఈ స్వచ్ఛంద సేవతో, అవసరమైన సేవ ప్రజలకు చేయాలని మరియు స్వర్గంలో మా తల్లిదండ్రులను గౌరవించాలని మేము ఆశిస్తున్నాము" అని జోలిండా సోషల్ మీడియా సైట్‌లో వ్యక్తం చేశారు. బ్రాగంజా కుటుంబం కొత్తగా ప్రారంభించిన సేవ వెనుక వారి తల్లిదండ్రుల చర్యలను స్ఫూర్తిగా గుర్తిస్తుంది. "మా తల్లిదండ్రులు వారి సేవల ద్వారా మాకు బోధించారు, వాటిని స్వీకరించడంలోఉన్న  ఆనందం కంటే ఇవ్వడం యొక్క ఆనందం ఎక్కువ కాలం ఉంటుంది," అని చెప్పారు.

ఉత్తర గోవాలోని పిలార్‌లోని గురుశ్రీ  ఏంజెల్ సెంట్రల్ స్కూల్ ప్రిన్సిపాల్ గురుశ్రీ రాన్సీ బ్రగాంజా మాట్లాడుతూ, తన వృద్ధ తండ్రిని చూసుకుంటున్నప్పుడు, సాధారణ ప్రజలకు ప్రాథమిక వైద్య పరికరాలను పొందడం ఎంత కష్టమో తాను గ్రహించానని చెప్పారు. బల్తాజార్ డిసెంబర్  5, 2021న, పోలీసియానా ఐదున్నర సంవత్సరాల క్రితం మరణించారు."ఒక గురువు కావడంతో, ఆరోగ్య సంరక్షణ పరికరాలను ఏర్పాటు చేయడం నాకు చాలా సులభం" అని గురుశ్రీ రాన్సీ RVA న్యూస్‌తో అన్నారు. ఇంట్లో ప్రాథమిక చికిత్స తీసుకుంటే ప్రజలకు వైద్య ఖర్చులు ఆదా అవుతాయని రాన్సీగారు అభిప్రాయపడ్డారు. ఈ కాథోలిక కుటుంబ వారసత్వాన్నిఇతరుల సేవలో కోనసాగించాలని వారి తల్లిదండ్రులు కోరిక . కుటుంబ సభ్యులు  స్పష్టమైన లక్ష్యంతో మీరు  ఇతరులకు సహాయం చేయడానికి మేము మీకు సహాయం చేస్తున్నాము అని వారి తెలిపారు .

ఈ సేవ ప్రధానంగా చించినీమ్ ప్రజల కోసం అయినప్పటికీ, పొరుగు గ్రామాలకు సేవను చేయడానికి ఆహ్వానిస్తూ మతాలకు అతీతంగా ఈ సేవ ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని వ్యక్తం చేసారు.

Add new comment

3 + 11 =