Radio Veritas Asia Buick St., Fairview Park, Queszon City, Metro Manila. 1106 Philippines | + 632 9390011-15 | +6329390011-15
సోషల్ నెట్‌వర్క్‌లను జాగ్రత్తగా ఉపయోగించండి
సోషల్ నెట్‌వర్క్ లో మీరు ఎం చేయవచ్చు? ఎక్కువ మంది తో చాట్ చేయొచ్చు ,చాల ఎక్కువ మంది తో మాట్లాడొచ్చు. ఫొటోస్ షేర్ చేయొచ్చు ,జోక్స్ షేర్ చేయొచ్చు.
మీరు ఏమి అనుకుంటున్నారో చెప్పొచ్చు ఈ సోషల్ మీడియా లో. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎం చేస్తున్నారో కూడా మీరు తెలుసుకోవచ్చు . ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది.ఫేస్బుక్,ఇంస్టాగ్రామ్,షేర్ చాట్ మిగతా సోషల్ నెట్‌వర్క్‌లు చూడడానికి అంత ప్రమాద కరంగా కనిపించకపోవచ్చు . కానీ ఒకసారి లాగింగ్ చేసారంటే..... జాగ్రత్త ....అది చాల ప్రమాదకరమైన ప్రదేశం.
మీ ఇంటిలో పెద్దవారు ఒప్పుకున్నా ,మీరు మాత్రం చాల జాగర్తగా ఉండాలి.
ఎటువంటి జాగర్తలు తీసుకోవాలి ?
1.మొదటిగా వారు మొదటిపేజీ లో ఇచ్చే రూల్స్ ని ఫాలో అవ్వాలి .
2.మీ వ్యతిగత సమాచారాన్ని అంటే ఫోన్ నంబర్స్, చిరునామా లాంటివి పోస్ట్ చేయకూడదు.
3. అలాగే మీరు ఎప్పుడూ ఇంట్లో ఉంటారు, ఎప్పుడూ ఊరు వెళ్తారు అనే సమాచారాన్ని కూడా పోస్ట్ చేయకూడదు. ఎందుకంటె వీటిని ఉపయోగించుకుని దొంగలు మీ ఇంటిలో దొంగతనం చేయొచ్చు.
4.తెలియని వారినుండి వచ్చే అభ్యర్ధనలలో, రిక్వెస్ట్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కాబట్టి అందరు నా గురించి ఇలానే అనుకోవాలి అని పోస్ట్లు పెడుతున్నాన ?? ఇపుడే కాదు తర్వాత నేను జాబ్ కి ఇంటర్వూస్ కి వెళ్ళేటపుడు మీరు పెట్టిన పోస్ట్లు గురించి అడిగితే ? లేదా మీరు ఫాలో అవుతున్న గ్రూప్స్ , లైక్ ,షేర్ చేసిన వాటికొరకు అడిగితే ??
సామెతలు 22:1, లో చూసినట్లు ఐతే "మంచివారు అనిపించుకొనుట వెండి, బంగారం కంటే విలువైనది" అని బైబిల్ చెపుతుంది కదా?
ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేదా ఫాలోవర్స్ ఉంటే అంత మంచిదనుకుంటున్నారా ? అసలు కాదు .ఆలా అనుకుంటే మీకే నష్టం .మీరు మీ ఆన్లైన్ ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవుతుంటే, మీకు తెలియకుండా వాళ్ల ఫ్రెండ్స్ తో కూడా కనెక్ట్ అవుతుంటారు. వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా .... అపుడు మీకు అస్సలు తెలియని వాళ్ల నుండి మెసేజెస్ రావడం మొదలవుతుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళో,వారి ఆలోచన విధానం మీలా ఉండకపోవచ్చు, కొన్ని సార్లు వారి వల్ల మీరు ఇబ్బంది పడొచ్చు. వాళ్ళు బూతులు మాటాడొచ్చు లేదా మీ పోస్టులకు కామెంట్స్ చేయొచ్చు లేదా ఫ్రెండ్స్ అని ,ప్రేమించమని మెసేజెస్ చేయొచ్చు. అలంటి వారితో స్నేహం చేయొచ్చా?? సోషల్ మీడియా లో ఐనా లేదా బయట ఐనా చేయకపోవడమే మంచిది.
కీర్తన 26:4, చూసినట్లు ఐతే బైబిల్ వేషధారుల కోసం హెచ్చరిస్తుంది. మీ తో చాట్ చేసే వాళ్ళు వాళ్ళగురించి వాళ్ళు అబద్దలు చెపొచ్చు, వాళ్ళు మీకు చాల మంచి ఫ్రెండ్స్ ల మీకు అనిపించొచ్చు. కానీ చివరకు వాళ్ళు చాల ప్రమాదకరం గా మారొచ్చు.
కాబట్టి మంచి ఫ్రెండ్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. బయట తెలిసిన ఫ్రెండ్స్ ఐతే మంచిది.మీ టైం ఎంత స్పెండ్ చేస్తున్నారో చూస్తుండండి.దానికి బానిస కాకుండా జాగ్రత్తపడండి.
Add new comment