సెయింట్ జోసఫ్ మహిళా డిగ్రీ కళాశాల, జే.ఎం.జే నగర్, కర్నూలు నందు 18-19 ఫిబ్రవరి 2022 న వ్యక్తిత్వ వికాసంపై సెమినార్ జరిగింది.

అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు మరియు అమర్లపూడి ప్రశాంత్ గారు(MSc, Jesus Youth Member) వాఖ్యతలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మిస్టర్ ప్రశాంత్ గారు వ్యక్తిత్వ వికాసంలో భాగంగా " Know Yourself" మరియు కెరీర్ మార్గదర్శకత్వం అనే అంశాలపై యువతను ప్రోత్సహిస్తూ మాట్లాడారు."
"యువత లక్ష్యాన్ని చేరుకోవడంలో వారు ఎప్పుడు దైర్యంగా ముందుకు వెళ్లాలని, కష్టాలని దైర్యంగా ఎదురించాలని" ప్రశాంత్ గారు అన్నారు

దేవుడిని, తల్లితండ్రులను, గురువుల నుండి మంచి అలవాట్లను ఎలా అనుకరించుకోవాలో ఫాదర్ సుధాకర్ గారు విద్యార్థులకు తెలియచేసారు.

కాలేజీ ప్రిన్సిపల్ సిస్టర్ పౌలిన్ JMJ గారు విచేసిన గురుశ్రీ పప్పుల సుధాకర్ గారిని, మిస్టర్ ప్రశాంత్ గారిని మరియు హాజరైన విద్యార్థులను అభినందించారు. 

Add new comment

3 + 14 =