"వేలాంగణిమాత దేవాలయ" విచారణ యూత్ | St.Claret Youth | కైలాసపురం

service

వైజాగ్ అతిమేత్రాసనం కైలాసపురం లోని  "వేలాంగణిమాత దేవాలయ"  విచారణ యూత్ ( St.Claret Youth ) మరొక సారి తమ సేవా నిరతిని చాటుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా విచారణ లో  మరియు దేవాలయం చుట్టుపక్కన అవసరంలో ఉన్న వారిని గుర్తించి  వారికీ ఉచితంగా దుప్పట్లు మరియు చీరలు పంపిణి చేయడం జరిగింది. సుమారు 30కుటుంబాలకు  ఉచితం గా దుప్పట్లు మరియు చీరలను ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వేలాంగణిమాత దేవాలయ మాజీ యూత్  ప్రెసిడెంట్, యూత్ మార్గ చూపరి  శ్రీ ఆనంద్ గారి తో పాటు  సొండి రాజా , ఫాతిమా, కల్పనా  మరియు మహారాణి పేట విచారణ యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఆనంద్ గారు మాట్లాడుతూ నలుగురికి ప్రేమను పంచడం లోనే ఆనందం ఉందని తెలిపారు. సొండి రాజా  మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన  "అమృతవాణి - రేడియో వెరిటాస్ ఆసియ తెలుగు"  ఆన్లైన్ కంటెంట్ ప్రొడ్యూసర్  శ్రీ యుం. కె. స్వరూప్ కు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఫాతిమా మాట్లాడుతూ సేవ కార్యక్రమాలలో  "వేలాంగణిమాత దేవాలయ"  విచారణ యూత్ ( St.Claret Youth ) ఎప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు.

 

Add new comment

9 + 6 =