వివాహ తర్ఫీదు శిక్షణ తరగతులు

ఆదిలాబాద్ మేత్రాసనం, కుటుంబ విభాగం వారి ఆధ్వర్యంలో,   మంచిర్యాల, చావర్ పాస్టరల్ సెంటర్ నందు  మార్చి 06,  07,  మరియు 08 వ తేదీలలో మూడురోజుల పాటు "వివాహ తర్ఫీదు శిక్షణ తరగతులు" విజయవంతంగా జరిగాయి.

మూడు రోజుల శిక్షణలో భాగముగా మొదటి రోజున,  తెలుగు కథోలిక  పీఠాధిపతుల మండలి, ఫ్యామిలీ కమిషన్ సెక్రటరీ గురుశ్రీ అల్ఫోన్స్ నరిశెట్టి మరియు కరిస్మాటిక్ మూవ్మెంట్ సభ్యురాలు మేరీ ప్రకాశిని గారి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ మేత్రానులు మహా పూజ్య ప్రిన్స్ అంతోని తండ్రి గారు ఈ మూడురోజుల శిక్షణ శిభిరాన్ని ప్రారంభించారు. 

పవిత్ర గ్రంథములో కుటుంభాలు, కుటుంబ ఆధ్యాత్మికత, వివాహము ఒక సంస్కారము, కుటుంబము లైంగిక సంబంధము మరియు ఆరోగ్యము,  కుటుంబ సమస్యలు వాటి పరిష్కారాలు,  క్రైస్తవ కుటుంబ నైతిక విలువలు తిరుసభ ప్రబోధనాలు, క్రైస్తవ కుటుంబం తిరుసభ చట్టాలు, సామాజిక చట్టాలు, కుటుంబం పిల్లల పెంపకము, కుటుంబం ఆర్థిక ప్రణాళికలు అనే విషయాలపై ఈ శిక్షణ శిబిరం లో బోధించి అవగాహన కల్పించడము జరిగింది. 

సుమారు 26 మంది యువతి యువకులు ఈ శిక్షణలో పాల్గొన్నారు.

చివరి రోజు ఆదిలాబాద్ మేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ జోస్ మానికేతన్ సి.యం.ఐ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ శిక్షణ శిభిరంలో పాల్గొనిన వారందరిని అభినందించి సర్టిఫికెట్స్ ప్రధానము చేసారు.
ఆదిలాబాద్ మేత్రాసన కుటుంబ విభాగము డైరెక్టర్ గురుశ్రీ. ఎన్.  ప్రభాకర్ గారు ఈ వివాహ తర్ఫీదు శిక్షణ శిభిరం నిర్వహించుటకు సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేసారు.

Add new comment

11 + 6 =