విజయవంతం గా ముగిసిన సమ్మర్ క్యాంప్

విజయవంతం గా ముగిసిన సమ్మర్ క్యాంప్

విశాఖ అతిమేత్రాసనం  ఆర్. వి నగర్ లోని శాంతి సాధన ఎడ్యుకేషనల్ కాంప్లెక్స్ లో పిల్లల కొరకు  ఏర్పాటు చేసిన  సమ్మర్ క్యాంప్ విజయవంతం గా ముగిసింది.  15 రోజులపాటు  జరిగిన  ఈ కార్యక్రమం లో పిల్లలకు కంప్యూటర్ , స్పోకెన్  ఇంగ్లీష్ మరియు మ్యూజిక్, గిటర్ నందు శిక్షణను ఇచ్చారు .  స్కూల్ కరస్పాండెంట్ గురుశ్రీ హరీ ఫిలిప్స్ గారి ఆధ్వర్యంలో ఈ  సమ్మర్ క్యాంప్ జరిగింది. పిల్లల కొరకు ప్రత్యేక శ్రద్ద తీసుకుని ప్రోగ్రామ్స్ ను రూపొందించారు గురుశ్రీ హరీ ఫిలిప్స్ గారు.  పిల్లందరికొరకు సంస్కృతిక కార్యాక్రమాలు కూడా ఏర్పాటు చేసారు.

 ఈ సమ్మర్ క్యాంప్ చివరి రోజు విశాఖ అగ్రపీఠాధిపతులు మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారు ముఖ్య అథితిగా పాల్గొని పిల్లలకు తమ అమూల్యమైన సలహాలు,సూచనలు ఇచ్చారు.పాల్గొన్న పిల్లలకు సర్టిఫికెట్స్ ను అందజేశారు.  స్కూల్ కరస్పాండెంట్ గురుశ్రీ హరీ ఫిలిప్స్ మాట్లాడుతూ స్కూల్ సిబ్బంది సహాయ సహకారం వల్లనే ఈ  కార్యక్రమం విజయవంతం గా పూర్తి చేశామని, సహాయం చేసినటువంటి సిస్టర్స్ , టీచర్స్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Add new comment

3 + 11 =