వరంగల్ మేత్రాసన యువత రక్తదాన శిబిరం

5-2-2022 న వరంగల్ మేత్రాసనం,కరుణాపురం, సెయింట్ జేవియర్ మేజర్ సెమినరీ నందు తలసీమియా  రోగంతో బాధపడుతున్న చిన్నారి బిడ్డలకొసం రెడ్ క్రాస్ సొసైటీ వారు మహా పూజ్య డాక్టర్ ఉడుమల బాల తండ్రి గారు వరంగల్ పీఠకాపరి అనుమతితో ఈ రక్తదాన శిబిరం  నిర్వహించడం జరిగింది. 

ఈ కార్యక్రమాన్ని ఫాదర్ మారేపల్లి ప్రవీణ్, ధర్మసాగర్ విచారణ గురువు మరియు కరుణాపురం డీన్ ప్రార్థనతో ప్రారంభించారు.

అరుణోదయ యువత కేంద్ర డైరెక్టర్ గురుశ్రీ సైమన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ రక్తదాన కార్యాక్రమంలో భాగంగా 55 మంది దాతలు ముందుకు వచ్చి, తమ రక్తాన్ని ఇష్టపూర్తిగా ఇవ్వడం జరిగింది. 

అరుణోదయ యువతను ఎల్లవేళల ప్రభువు దీవించాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ వారు కోరుకుంటున్నారు.

 

 

Add new comment

11 + 8 =