వరంగల్ మేత్రాసనం లో ఘనంగా జాతీయ యువతా ఆదివారం 2022.

ఆగస్టు 14, 2022 ఉదయం 7:30 గంటలకు వరంగల్, హన్మకొండ, ఫాతిమామాత కథెడ్రల్ నందు "జాతీయ యువతా ఆదివారం"  వేడుకలు ఘనంగా జరిగాయి. 

విచారణ యువతీ యువకులు బిషప్ హౌస్ నుండి ఫాతిమామాత దేవాలయము వరకు ప్రదక్షణగా వచ్చారు.
 
వరంగల్ పీఠకాపరి మహా పూజ్య ఉడుమల బాల తండ్రి గారు మేత్రాసన యువతీ యువకుల కొరకు ప్రత్యేక దివ్యబలి పూజను సమర్పించారు. 

ఈ 2022 జాతీయ యువతా ఆదివార ముఖ్య అంశము "మరియమ్మ లేచి త్వరితముగా వెళ్లెను" లూకా 1:39.

విచారణ కర్తలు గురుశ్రీ కాసు మర్రెడ్డి గారు, మేత్రాసన యువతా డైరెక్టర్ గురుశ్రీ వట్టి సైమన్ గారు మరియు విచారణ యువతీ యువకుల పీఠాధిపతులను సన్మానించారు.

వరంగల్ లోని ఇతర విచారణ లో కూడా జాతీయ యువతా ఆదివారాన్ని కొనియాడారు. వివిధ విచారణలో నుండి సుమారు 200 పైగా యువతీ యువకుల పాల్గొన్నారు

Add new comment

18 + 1 =