వరంగల్ మేత్రాసనం ఫాతిమానగర్ డీనరీ బాల బాలికల సదస్సు

వరంగల్ మేత్రాసనం, ఫాతిమా కమ్యూనిటీ హాల్‌ నందు అక్టోబర్ 1, 2022 న ఫాతిమా ఛారిటబుల్ ట్రస్ట్ స్కాలర్‌షిప్ అందుకునే బాల బాలికలకు సదస్సును నిర్వహించారు.

గురుశ్రీ టి జెరోమ్- డీన్,ఫాతిమానగర్ డీనరీ పరిచయ వాక్యాలు అందించగా  అనంతరం 
ఫాతిమా ఛారిటబుల్ ట్రస్ట్ (F.C.T) డైరెక్టర్  గురుశ్రీ మార్టిన్ గారు కొనసాగిచారు.

పునీత జేవియర్ సెమినరీ రెక్టార్ గురుశ్రీ సింగారెడ్డి బాలశౌరీ గారు 7 దివ్యసంస్కారాల ప్రాముఖ్యతను తెలియచేయగా, పాస్టోరల్ సెంటర్ డైరెక్టర్ గురుశ్రీ  గోపు కమల్ గారు  కొన్ని బైబిల్ కథనాలు మరియు బైబిల్ ప్రాముఖ్యతపై ప్రసంగించారు.

మధ్యాహ్న భోజనం తర్వాత జీసస్ యూత్ టీమ్ రూపేష్ మరియు సృజన్ బృందం వారు యాక్షన్ సాంగ్స్ నేర్పించారు

వరంగల్ పీఠకాపరి, ఖమ్మం మేత్రాసన పాలనాధికారి మహా పూజ్య. ఉడమల బాల తండ్రి గారు మరియు ఇతర గురువులు కలిసి డీనరీ బాలబాలిక కోసం ప్రత్యేక దివ్యబలి పూజను సమర్పించి వారికోసం ప్రార్ధించారు. ఈ సదస్సు కు సుమారు 500 మంది పిల్లలు హాజరయ్యారు.

ఫాతిమానగర్ డీన్ గురుశ్రీ టి జెరోమ్ గారి ఆధ్వర్యంలో ఫాతిమా మాత  కథడ్రల్ విచారణ గురువులు గురుశ్రీ కాసు మర్రెడ్డి మరియు F.C.T డైరెక్టర్ గురుశ్రీ మార్టిన్,  బృందం సహకారంతో నిర్వహించడం జరిగింది .

Add new comment

5 + 4 =