యేసుని మార్గంలో యువత

హైదరాబాద్  అతిమేత్రాసనం, మౌలాలి విచారణలో గల సెయింట్ జోసెఫ్ దేవాలయం ని  హైదరాబాద్ అతిమేత్రాసన యువత డైరెక్టర్ గురుశ్రీ సునీల్ గారు సందర్శించారు.ఈ సందర్భముగా గురుశ్రీ సునీల్ గారు  యువతీ యువకులకొరకు  ప్రత్యేక పవిత్ర దివ్య పూజాబలి ని సమర్పించారు. ఈ సందర్భముగా  గురుశ్రీ సునీల్ గారు మాట్లాడుతూ ప్రభు యేసుని ఆజ్ఞలను పాటిస్తూ ప్రభుని  మార్గం లో యువత నడవాలి అని  అన్నారు.  అనంతరం యువతీ యువకులతో సమావేశమైయ్యారు. యూత్ వారి నుండి అమూల్యమైన సలహాలను, సూచనలను తీసుకున్నారు . యువతను చైతన్య పరుస్తూ, దేవునికి, దేవాలయానికి  దగ్గరగా ఉండాలని, ప్రతి నెల ఒక సేవ కార్యక్రమాన్ని చేయాలనీ యువతకు సూచించారు .గురుశ్రీ సునీల్ గారు  యువతీ యువకులను చైతన్య పరుస్తూ  ప్రతి వారము (ఆదివారం) ఒకొక్క విచారణకు పర్యటిస్తున్నారు. యూత్ లేని విచారణలో క్రొత్త యువతను నియమిస్తూ వారికీ తగిన సహకారాన్ని అందిస్తున్నారు.యువతను ప్రభు యేసుని మార్గం లో నడిపిస్తున్న గురుశ్రీ సునీల్ గారిని ఆ దేవాది దేవుడు దీవించాలని కోరుకుంటూ అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం.
 

 

Add new comment

6 + 9 =