యువత శ్రీసభ సంపద

యువత యువత

యవ్వనస్తుల శక్తిని ఉత్సాహపరిచి, ప్రగతివైపు వారిని అడుగులు వేయించాలనేదే పోప్ ఫ్రాన్సిస్ కాంక్ష. ఎందుకంటే దిశానిర్దేశం చేసుకోవటం నిర్ణియించుకోవటం యువతకు అలి ఒక సవాల్ గా మారింది. అధ్యాత్మిక, శారీరక, మానసిక ఒత్తిళ్ళ మధ్య, నేటి యువత నిరాశ నిస్పృహలతో జీవిస్తున్నారు. నేటి యువత రేపటి శ్రీసభ సంపద అని పోప్గారంటుంటే, నేటి యువత రేపటి దేశసంపద అని దేశ నేతలంటున్నారు. కారణం? యుక్త వయస్సు అనేది మహాశక్తి వంతమైన దశ. అనగా దేనినైన మార్చే శక్తి యువతకి ఉన్నదని అర్థం.

యువత యొక్క ఈ మహాశక్తి దుర్వినియోగం కాకుడదు. వివేకానంద వారే వంటి ఆధ్యాత్మిక గురువుల మాటలను మననం చేసుకుందాం. “మీరెలా ఆలోచిస్తే అలాగే తయరావుతారు. మిమ్మల్ని మీరు బలహీనులని భావిస్తే ఎవ బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు. బైబులు గ్రంధంలో ఉపదేశకుడు ఈ తపు యవ్వన దశను దుర్దినములు (ఉపదేశకుడు 12:1) అంటారు. సహా ఎందుకంటే మనస్సులో కొత్త కోరికలు చిగురించు వేళ అది. కన్నులు వాచించిన వాంఛలు తీర్చుకొన బలవంతమైన ప్రేరణకు గురి అగువేళ అది. జాగ్రత్త వహించకపోతే జీవితం ప్రక్కదారి పడుతుంది. బహుశ అందుకేనేమో! పౌలుగారు తన శిష్యుడైన తిమోతిని ఆదర్శముగా ఉండటంలో జాగ్రత్త వహించమంటున్నాడు, “నీ మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను మరు విశ్వాసులకు ఆదర్శముగా ఉండమంటున్నారు (1తిమోతి 4:12) శ్రీశ్రీ మాటలు నమరువేద్దాం “కుదిరితే పరుగెత్తు, లేకపోతే నడవు, అది చేతకాకపోతేనే పాకుతూపో. అంతేకాని, ఒకే చోట కదలకుండా ఉండిపోకు”. బహుశ ఈ మాటలు వాస్తవం. ప్రార్థనతో కూడిన శ్రమ కావాలి. అప్పుడే ఎమైన సాధించగలం. పునీతులు, వేదసాక్షులైన వారందరు కూడా యువతరానికి చెందిన వారే. ఆ యువతరంలో జపమాలను చేపట్టి శోధనలను, యవ్వన దశ వ్యామోహాలను (1
కొరింతి 2:22) జయించారు. ఇది సత్యం. ఈ సత్యాన్ని ఎవరు మరువదు. యవ్వన దశలో అన్ని ఆకర్షణీయంగానే కనిపిస్తాయి. కాని ఆ ఆకర్షణలలో ఇరుక్కోని పోకుండా జాగ్రత్తపడాలి. అందుకే పౌలుగారు “సమస్త మును పరీక్షింపుము. మంచిని మాత్రమే గ్రహింపుడు. అన్ని విధములైన చెడుకు దూరంగా ఉండుడు” (1తెస్సలో 5:21, 22) అని అంటున్నారు. సమస్తమును పరీక్షించి, మంచిని గ్రహించటం అంత. సులువైన విషయం కాదు. ఎంతో దైవబలం అవసరం. ప్రాపంచిక వ్యవనాలు, వ్యామో హాలు క్షణికమే. భూలోక యంత్రాలు, మంత్రాలు కనురెప్పపాటు కాలమే. వీటిలోనే అంతా ఉందని భ్రమించకు.

నీ వ్యక్తిత్వం వీటిలో లేదు. అసలు నీ వ్యక్తిత్వానికి వీటికి అస్సలు సంబందం లేదు. నీ నడకలో, నడవడికలో ఉంది, నీ వ్యక్తిత్వం. యేసు వ్యక్తిత్వాన్ని చూడు: ఆయనకు పరలోక జ్ఞానం ఉంది, దానికి మించిన ప్రేమ ఉంది. అద్భుతాలు చేయగల శక్తి ఉంది, అంతకు మించి వినయ విధేయతలున్నాయి. అత్యున్నత సింహాసనముపై ఆశీనమయ్యే అర్హత ఉంది. అంతకుమించిన మహిమ ఉంది, అంతకంటే ఎక్కువగా అందరి కోసం మరణించే త్యాగ గుణం ఉంది. అది వ్యక్తిత్వం అంటే. అది ఆయన కర్తవ్యం. ఆయనే నీకు ఆదర్శం. నీ యేసు మనస్తత్వాన్ని అలవర చుకో (ఫిలిప్పీ 2:5). అతడు పిలుస్తున్నాడు; ఆ దారిలో నడువు.

కానీ వెనక్కి చూడకు. సాహసమే ఊపిరిగా సాగించు పోరాటం: నీ వయసుతో, నీ మనసుతో. నీ వయసు వేడిని ఒడిసిపట్టు. నీ మనసు అనే కత్తికి పదును పెట్టు. సలసలకాగే నీ ఉడుకు రక్తాన్ని చల్లార్చకు. యవ్వన యేసును వెంబడించు. నీకు అర్థం అవుతుంది. ఉరకలు వేసే వయస్సు. మరకలు లేని మనస్సు. అయినా మనసుకు యేసు మచ్చను రానివ్వలేదు, స్వచ్చమైన మనసును చేజార్చలేదు.

Add new comment

2 + 1 =