"యువత మరియు దైవపిలుపు " సంవత్సరాన్ని ప్రారంభించిన ఆదిలాబాద్ మేత్రాసనం.

ఆదిలాబాద్ పీఠం, ఎఫాత రిట్రీట్ సెంటర్ నందు అక్టోబర్ ౬ ౨౦౨౨ న ఆదిలాబాద్ మేత్రానులు మహ పూజ్య. ప్రిన్స్ అంథోని గారు, మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు మహ పూజ్య జోసెఫ్ కున్నత్ CMI గారు,మేత్రాసన యువతా డైరెక్టర్ గురుశ్రీ జిజో గారు, గురుశ్రీ దానియల్ గారు, యువతీ యువకు

ఆదిలాబాద్ పీఠం, ఎఫాత రిట్రీట్ సెంటర్ నందు అక్టోబర్ 6 2022 న ఆదిలాబాద్ మేత్రానులు మహ పూజ్య. ప్రిన్స్ అంథోని గారు, మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు మహ పూజ్య జోసెఫ్ కున్నత్ CMI గారు,మేత్రాసన యువతా డైరెక్టర్ గురుశ్రీ జిజో గారు, గురుశ్రీ దానియల్ గారు, యువతీ యువకుల ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలను చేసి 2022-2023ను  "యువత మరియు దైవపిలుపు " సంవత్సరాన్ని  ప్రారంభించారు. 

"యువతా మేలుకో, శ్రీసభను మేల్కొలుపు" అనే నేపథ్యంతో 
* మేత్రాసన స్థాయిలో, జోనల్ స్థాయిలో, విచారణ స్థాయిలో యువతా పునరుద్ధరణ కార్యక్రమాలు (YOUTH RENEWAL PROGRAM ), 
* ప్రత్యేక యువతా వడకాలు (Youth Retreat) , 
* ఓరియెంటేషన్ అండ్ వర్కుషాప్స్ ఫర్ యూత్,యువత సమ్మేళనాలు ఏర్పాటు చేయనున్నారని.
* ఈ సంవత్సరమంతా ప్రతి నెల రెండవ ఆదివారం విచారణ యువతీయువకుల కోసం కేటాయించనున్నామని,విచారణలో జరిగే ప్రతీ కార్యక్రమంలో యువత పాల్గొనేలా ప్రోత్సహిస్తామని,
* ఉద్యోగ నియామకాలకై  నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, 
* యువతకు యాత్రలు నిర్వహించనున్నామని గురుశ్రీ జిజో గారు తెలియచేసారు.

మేత్రాణుల వారు "యువత మరియు దైవపిలుపు  సంవత్సరం" లోగో (ప్రతీక)ను లాంఛనంగా ఆవిష్కరించారు.

ఆదిలాబాద్ మేత్రాణులు మహ పూజ్య. ప్రిన్స్ అంథోని గారు మరియు మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు మహ పూజ్య జోసెఫ్ కున్నత్ CMI గారు ఇతర గురువులు కలిసి సమిష్టి దివ్యబలి పూజను సమర్పించారు.

ఆదిలాబాద్ మేత్రాసన యువతను ఆ దేవాదిదేవుడు ముందుండి నడిపించి, దీవించాలని అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు కోరుకుంటున్నారు

Add new comment

6 + 9 =