యువత చేతుల్లోనే సమాజ భవిష్యత్తు

కడప మేత్రాసనం, మరియాపురం విచారణ నగర పరిధిలోని 50వ డివిజన్, దండు గ్రామంలోని పునీత చిన్న తెరేసమ్మ గారి దేవాలయము నందు సెప్టెంబర్ 27 2022 న సెయింట్ తెరేసాస్ యూత్ క్లబ్ ను ప్రారంభించారు.

విచారణ గురువు బిరుసు రాజా గారు సెయింట్ తెరేసాస్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లోగో (ప్రతీక) ను లాంఛనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "యువత చేతుల్లోనే సమాజ భవిష్యత్తు ఆధారపడి ఉందని, ప్రతి యువకుడు ఆదర్శంగా జీవించడమే కాకుండా, సేవా గుణం అలవర్చుకోవాలని హితవు పలికారు.

ప్రతి కుటుంబం ఆధ్యాత్మిక చింతన కలిగి జీవించేలా కృషి చేయాలని చెప్పారు, గ్రామం సక్రమమైన మార్గంలో పయనించేందుకు నడుం బిగించాలని సూచించారు, అందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

అనంతరం కడప మేత్రాసన యువతా డైరెక్టర్ గురుశ్రీ లూర్దురాజు గారు మాట్లాడుతూ యువతీ, యువకులకు అసాధ్యమైనది ఏదీ లేదని- స్వామి వివేకానంద గారు చెప్పిన మాటలను గుర్తు చేశారు. దేశాన్ని మార్చగల శక్తి సామర్థ్యాలు యువత చేతుల్లోనే ఉందన్నారు. 

యూత్ క్లబ్ ద్వారా ఇటు ఆధ్యాత్మికంగా,అటు సామాజికంగా విశృతమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని క్లబ్ సభ్యులైన అఖిల్ మెల్లా మరియు నూతన్ జ్యోతి గార్లు తెలిపారు. 

యువతులు నృత్యం చేస్తూ గురువులను ఆహ్వానించగా. గురువులు ఇరువురు యూత్ క్లబ్ చిహ్నముతో  కూడిన పతాకాన్ని ఆవిషరించి,  దివ్య బలిపూజను సమర్పించి దండు గ్రామ యువతీ యువకుల కొరకు ప్రత్యేకంగా ప్రార్ధించారు.

ఈ కార్యక్రమంలో దండు గ్రామంలో యువతీ యువకులు 20 మంది క్లబ్ సభ్యులుగా నమోదు చేస్కున్నారని విచారణ కర్తలు గురుశ్రీ బిరుసు రాజా గారు ఆర్. వి .ఏ తెలుగు విభాగం వారితో తెలిపారు.

Add new comment

9 + 7 =