యువతకు నైపుణ్య శిక్షణను అందించిన కలకత్తా అగ్రపీఠ సామాజిక సేవా విభాగం

పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా అగ్రపీఠం సామాజిక సేవా విభాగం మే 15న యువత మరియు పెద్దలకు నైపుణ్య శిక్షణను నిర్వహించింది.

సేవా కేంద్రం (సామాజిక సేవా కేంద్రం) కలకత్తా లైఫ్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్ డిపార్ట్‌మెంట్ ప్రోగ్రాం బృందం "బ్రైడల్ అండ్ మేకప్" (వివాహానికి సంబందించిన అలంకరణ) అనే ప్రత్యేకమైన వర్క్‌షాప్‌ను నిర్వహించింది.
నగరం నుండి వివిధ ప్రదేశాలనుండి మేకప్ ఆర్టిస్టులు కావలి అని ఆకాంక్షిస్తున్న 95 మంది పార్టిసిపెంట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ విద్యార్థుల ప్రార్థన గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలకత్తా సేవాకేంద్రం డైరెక్టర్ గురుశ్రీ అంతోని రోడ్రిక్ తన ప్రేరణాత్మక ప్రసంగంతో విచ్చేసిన వారిని ప్రోత్సహించారు.

బ్యూటీ అండ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్ ట్రైనర్ సంధ్య సర్దార్ తన ప్రారంభోపన్యాసంతో కార్యక్రమాన్ని పరిచయం చేశారు.

ఈ సేవ కేంద్రం పూర్వ విద్యార్థి RK రిష్ ఈ కార్యక్రమంలో పాల్గొని "ఈ సంస్థ తన నైపుణ్యాలను సంపాదించడంలోను, ప్రఖ్యాత బ్యూటీషియన్‌ కావడానికి సహాయపడింది" అని తెలిపారు.

కార్యక్రమంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ సౌవిక్ బోస్, ట్రైనర్ ముస్కాన్ సింగ్ సహకరించారు. 

 

కలకత్తా అగ్రపీఠం రిలీఫ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని " కలకత్తా సేవా కేంద్రం" అని పిలుస్తారు. 1973లో స్థాపించబడినప్పటి నుండి, సంస్థ సామాజిక అభివృద్ధి మరియు ఇంటర్మీడియట్ టెక్నాలజీలను చేర్చడానికి తన దృష్టిని సారించింది. సుమారు పశ్చిమ బెంగాల్‌లోని ఎనిమిది జిల్లాల్లో ఈ సేవా కేంద్రం పనిచేస్తుంది. 

Add new comment

1 + 1 =