యవనుడా నీ గమ్యం ఎటువైపు ?

డేటి౦గ్‌ :

డేటి౦గ్‌ వెనుక ఒక గౌరవప్రదమైన కారణ౦ ఉ౦ది. ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి ఒకరికొకరు సరిపోతారో లేదో తెలుసుకోవడానికే డేటి౦గ్‌ చేస్తారు.అంటే  అభిప్రాయాలు,అభిరుచులు తెలుసుకొనేందుకు .ఈ రోజులల్లో  కొ౦తమ౦ది డేటి౦గ్‌ని సరదాగా తీసుకోవచ్చు. వాళ్లు బహుశా పెళ్లి చేసుకునే ఉద్దేశ౦ లేకపోయినా ఒక అమ్మాయి / అబ్బాయితో కలిసి సమయ౦ గడపడాన్ని ఇష్టపడవచ్చు. మరికొంతమంది పైకి చూపి౦చుకోవడానికి ,వారి స్టేటస్ తెలపడానికి కూడా  ఈ విధంగా చేస్తున్నారు. పైకి చూపి౦చుకోవడానికే ఉన్న ఆ బ౦ధ౦ ఎక్కువ కాల౦ నిలువదు. పల్లవి అనే అమ్మాయి ఇలా అ౦టు౦ది, “డేటి౦గ్‌ చేసే చాలామ౦ది యువత, ఒక వార౦ లేదా రె౦డు వారాల్లోనే విడిపోతున్నారు  మరియు వాళ్లు బ౦ధాలను తాత్కాలికమైనవిగా చుస్తున్నారు. 

డేటి౦గ్‌ చేయడానికి ఎ౦దుకు తొ౦దరపడకూడదు?

ఏమి చదవకుండా పరీక్షా వ్రాయడం ఎటువంటిదో , ప్రేమ అనే ముసుగులో డేటి౦గ్‌ చేయడానికి సిద్ధపడడం కూడా అటువంటిదే . మీరు వ్రాసే పరీక్షలో ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకొని, వాటి కోస౦ ముందుగానే సిద్దపడుతున్నారు కదా ??డేటి౦గ్‌ చేసే౦దుకు తొ౦దరపడకు౦డా కాస్త ఆగడ౦ వల్ల మీ స్వేచ్ఛకు భ౦గ౦ కలుగదు.

కలసి జీవించుదాం అనే ధోరణి (Living together):

కొంతమంది యువతలో కలసి జీవించుదాం అనే ధోరణి చూస్తున్నాము .ఎందుకంటె ఇంటి పెద్దలు ఒప్పుకుంటారా లేదా అనే భయం ,వారికీ చెప్పవల్సిన వసరం లేదు అనే భావన చూస్తున్నాము . మనం డబ్బు సంపాదిస్తున్నం  కదా,మన డబ్బు  మనకు నచ్చిన్నట్టు వాడుకోవచ్చు  అని , ఏమి  తిందుమా ,ఏమి తాగుదామా , ఎవరి తో తిరుగుదామా అనే భావనలో చాలామంది యువత ఉన్నారు. తప్పు చేస్తున్నాము అనే భావన లేకుండా , ఫ్రెండ్స్ దగ్గర , ఇతరుల దగ్గర గొప్పగా చెప్పుకుంటున్నారు . we are in relationship అని లేదా we are in dating అని  చేయకూడని పనులను చేస్తూ  అటు దేవునికి ,ఇటు తల్లిదండ్రులకు ద్రోహం చేస్తున్నారు .

బైబిల్ :

యువకుడా! నీ యవ్వనమును అనుభవింపుము. నీ యవ్వన కాలమును చూచి సంతసింపుము. నీ మనస్సు కోరిన కోర్కెలు, నీ కన్నులు వాంఛించిన వాంఛలు తీర్చుకొనుము. అయితే వీటినన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము (ఉపదేశకుడు 11:9) .

కాబట్టి   తొ౦దరపడి ఒకరికి ఫిక్స్‌ అయిపోతే భవిష్యత్తులో మీ కష్టాలను మీరే కొని తెచ్చుకున్నవారు అవుతారు.  తగిన౦త సమయ౦ తీసుకో౦డి. మీ జీవిత౦లో ఉన్న ఈ సమయ౦లో, మ౦చి స్నేహితులను స౦పాది౦చుకోవడ౦, ఆ స్నేహితులతో మీ బ౦ధాన్ని చక్కగా కొనసాగి౦చడ౦ ఎలాగో నేర్చుకో౦డి.

మీకోసం ఎదురు చూసే మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి .చిన్నప్పటినుండి మంచి బట్టలు కొని ,మంచి స్కూల్ లో చేర్పించి  ,కాలేజీ ఫీజులు కట్టి , శ్రేష్ఠమైన వాటిని మీకు ఇచ్చినది మన తల్లిదండ్రులే  కదా ?

అలానే మీ జీవిత భాగస్వామి విషయంలో వారిని సంప్రదించడంలో తప్పుఏముంది ??

"మీ తల్లిదండ్రులను గౌరవింపుడు "అని దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలో వుంది కదా ?  

మీకోసం కష్టపడినా అమ్మ ,నాన్నలు మీరు గొప్పవారు ఐతే చూడాలనుకునే వారి ఆశలోను చెరిపేయకుండా , కొన్ని రోజులు కలసి , తర్వాత విడిపోయేది ....పెళ్లి చేసుకుని , మళ్ళి నచ్చక ఇంకో పెళ్లి చేసుకుని , అది కూడా నచ్చక ఇంకో పెళ్లి అనేది  ప్రేమ అంటారా ? దేవుని ముందు వివాహ సమయం లో చేసిన ప్రమాణాలు అన్ని ఒట్టి మాటలేనా ?  "వివాహము అన్ని విషయములలో ఘనమైనది" అని బైబిల్ చెపుతుంది గదా ?
 

ప్రేమ అంటే వంద సంవత్సరాలు కలసి మెలసి కష్టసుఖాలలో ఒకరికొకరు చివరి వరకు తోడుండడమే ప్రేమంటే . అలంటి ప్రేమకు ,అలంటి ప్రేమికులకు ఈ ప్రేమికుల రోజు సందర్భముగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము .

 

Add new comment

13 + 7 =