"మేము ఉన్నాం.. మీకు అండగా" - St.Claret Youth,Vizag

 రెండో వేవ్ విజృంభిస్తోన్న వేళ  ఆసుపత్రులు రోగులతో నిండుతున్నాయి. లొక్డౌన్, కర్ఫ్యూ  ఉండడం చేత చాల మంది ప్రజలు ఇండ్లకే పరిమితం అవుతున్నారు. మన మహా విశాఖ లో కూడా కరోనా రెండో వేవ్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇటువంటి పరిస్థితులలో  మన విశాఖపట్నం లోని  కైలాసపురం లో గల "వేలాంగణిమాత దేవాలయం చర్చ్ యూత్ " ( St.Claret Youth ) "మేము ఉన్నాం.. మీకు అండగా" అంటూ ముందుకు వచ్చారు.

 లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్న కైలాసపురం యూత్ వారు వైజాగ్ లో పలు ప్రాంతాల్లో ఇళ్లులేని అభాగ్యులకు, అనాధలకు, అవసరం లో వున్నవారికి ఆహారాన్ని అందిస్తున్నారు.సుమారు 20 మంది యువతీ యువకులు నిస్వార్థమైన సేవ చేస్తున్నారు.
సొండి రాజా  ఈ విషయంపై మాట్లాడుతూ ఈ కర్ఫ్యూ సమయంలో  చాలామంది ఆహరం లేక ఇబ్బంది పడుతున్నారని , యూత్ గా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసాం, ఐతే ఈసమయం లో సహాయం చేయడం చాల ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు.కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని శేఖర్ తెలిపారు.

యూత్ ప్రెసిడెంట్  రంజీ మాట్లాడుతూ  యూత్ లో ఉన్న ప్రతి ఒక్కరి సహాయం మరువలేనిదని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయకపోయినా ప్రతి ఒక్కరు వారి పాకెట్ మనీ నుండి  ఈ కార్యక్రమానికి సహాయం చేస్తున్నారని, అలాగే విచారణ కర్తలు రేవ్ ఫాదర్ సేవి పుతుస్సేరి మరియు రేవ్ ఫాదర్ జాసిన్ జోసఫ్ ల సహాయం మరియు ప్రార్థనలు మాకు ఎంతగానో స్ఫూర్తినిచ్చాయని  తెలిపారు. 

      

Add new comment

10 + 1 =