మయన్మార్లోని కథోలిక చిన్నారులు జపమాలను ప్రార్ధించారు

మయన్మార్లోని కథోలిక చిన్నారులు జపమాలను ప్రార్ధించారు  

మార్చి 2 విభూది బుధవారం రోజున మయన్మార్లోని కథోలిక చిన్నారులు జూమ్ ద్వారా ప్రపంచ శాంతి కోసం జపమాలను జపించారు. యాంగోన్‌లోని సాన్‌చాంగ్ టౌన్‌షిప్‌లో ఉన్న క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ మయన్మార్ (CBCM)లో హోలీ చైల్డ్ హుడ్ కమిషన్ వారు ఈ ఆన్‌లైన్ కార్యక్రమానికి నాయకత్వాన్ని వహించారు.
 బిషప్ ఎలెక్ట్ అఫ్ మాలాయాంగ్ మేత్రాసన సభ్యులు మొంసిగ్నోర్ న్యూన్ట్ వై గారు కార్యక్రమంలో పాల్గొని వారికి మంచి మాటలు తెలియజేసారు. మయన్మార్ మరియు ప్రపంచ శాంతి కోసం ప్రార్థించడం "తప్పనిసరి." దానికోసం మన దగ్గర ఉన్న మొదటి ఆయుధం ప్ర్రార్ధన మరియు జపమాల అని ఆయన తెలిపారు.

పోంటిఫికల్ మిషన్ సొసైటీకి జాతీయ డైరెక్టర్ ఐన  గురుశ్రీ బెనార్డినో నే నే గారు , జపమాల పఠనానికి నాయకత్వం వహించి, ఫ్రాన్సిస్ గారి తపస్సుకాల సందేశాన్ని కూడా అందించారు.ఆన్‌లైన్ జపమాల  CBCM ,OSC మరియు యాంగోన్ అగ్రపీఠం OSC యొక్క ఫేస్బుక్ పేజీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.రష్యా మరియు ఉక్రెయిన్ల మధ్య శాంతి కోసం ప్రార్థించాలనే ఫ్రాన్సిస్ గారి ఉద్దేశంతో సహా, జపమాల ప్రార్థన యొక్క ప్రత్యేక ఉద్దేశ్యాన్ని సలేసియన్ సిస్టర్ అగాథ గారు కార్యక్రమంలో పాల్గొన్నవారికి వివరించారు.

హోలీ చైల్డ్ హుడ్ కమిషన్ లో ఒకరైన పియోనే  అంగ్ గారు పిల్లలతో కలిసి ఆన్‌లైన్‌లో ప్రార్థన చేయడానికి సహకరరించినందుకు మొంసిగ్నోర్ న్యూన్ట్ వై గారికి ధన్యవాదాలు తెలియజేసారు.

Add new comment

1 + 0 =