మన సహోదరి సహోదరులకు ప్రేమ తో ...

covid help

మన సహోదరి సహోదరులు కొరకు ప్రేమ తో ...
కోవిడ్-19 సెకండ్ వేవ్  కారణంగా దేవుని ఆలయాలు మూతపడ్డాయి. ప్రతి వారము మనము కలిసే మన సంఘ స్నేహితులను మరియు వారం వారం మనం చూసే మన తోటి సహోదరి, సహోదరులు ఎలా ఉన్నారో కూడా తెలియని పరిస్థితి.  మన సహోదరి సహోదరులు చాలామంది ఇప్పుడు మన మధ్య న లేరు అనే నిజం చాల మంది ని కలచి వేస్తుంది.  
కోవిడ్-19 సెకండ్ వేవ్  కారణంగా పనులు లేక, రోజువారీ పనులే చేసే అవకాశం లేక  ఇబ్బంది పడుతున్న వారి కొరకు  మేము ఉన్నం అంటూ  "అమృతవాణి రేడియో వెరిటాస్ ఆసియ తెలుగు" ముందుకు వచ్చింది. విశాఖపట్నం లోని  సెయింట్ ఆంథోనీ చర్చి మహారాణి పేట విచారణ లో గల వార్డ్ బాయ్ లైన్(ward boy line) ప్రాంతం లో అవసరంలో ఉన్న 15 కాథోలిక కుటుంబాలను గుర్తించి వారికి ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేయడం జరిగినది.

ఈ కార్యక్రమములో  రెవరెండ్ ఫాదర్ హరీ ఫిలిప్స్ పాల్గొన్నారు. ప్రజలందరూ జాగ్రత్త గా ఉండాలని, అందరు మాస్క్ ధరించాలని సూచించారు. ఎల్లప్పుడు ప్రార్థనలో ఉండాలని కోరారు.  " రేడియో వెరిటాస్ ఆసియ తెలుగు" ఆన్లైన్ ప్రొడ్యూసర్(Broadcast producer)  క్రాంతి స్వరూప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సహకరించిన అనిత,వినయ్ మరియు రాజా లకు స్వరూప్ కృతజ్ఞతలు తెలిపారు.

 

Add new comment

6 + 9 =