మన కుటుంబము

కాథోలిక  కుటుంబ సభ్యులందరూ క్రీస్తు ప్రేమ ఎంతో శక్తి వంతమైనది అని నమ్ముతారు .

దేవుని ద్వారా సంకల్ప బడినది  క్రైస్తవ కుటుంబం .సమాజములో ప్రాముఖ్యమైనది కూడా ఒక మంచి క్రైస్తవ కుటుంబమే .

రెండవ వాటికన్  కౌన్సిల్ మాటలలో , కుటుంబం సమాజం లో  ప్రాథమిక మరియు కీలకమైనదిగా ఉండటం మరియు దాని నుండి ఒక దైవిక మిషన్  నెరవేర్చడానికి, ప్రతి కాథలిక్ కుటుంబానికి నిర్దిష్ట కోర్ విలువలు ఉండాలి.

ప్రతి కాథలిక్ కుటుంబానికి యేసు కేంద్రీకృతమైన మరియు యేసు  కుటుంబంగా యజమానిగా ఉండాలి.

అధిపతిగా ఉండటం కేవలం రక్షకుడిగా మరియు సంరక్షణకు మాత్రమే కాదు, యేసునాదుడే  మార్గదర్శకులు గా  మరియు ప్రతి విషయంలో  ముందుకు యేసు ప్రభువుని ప్రార్థన ద్వారా అడగడం కొనసాగాలి .అంతే గాక యేసు రాజ్య విలువలు చెప్పే వారిగా , అయన చూపించిన  ప్రేమ కలిగి ఉండాలి .

కుటుంబ ప్రార్థన :

ఒక మంచి క్రైస్తవ  కుటుంబంగా జీవించాలంటే ,ఆ కుటుంబం ముందుగా ప్రార్థనయందు బలపడాలి . ప్రతి రోజు ,ప్రభు సన్నిధి లో కుటుంబ యజమాని తో పాటూ భార్య ,పిల్లలు ,మిగతా కుటుంబ సభ్యులు ప్రార్థన లో గడపాలి .ఆలాగే కుటుంబములో ప్రతి ఒక్కరు ఏకాంత ప్రార్థన లో ప్రతిదినము మన తండ్రి యేన దేవుని తో మాటాడాలి . అపుడే మన తప్పు ,ఒప్పులు తెలుస్తాయి .అలాగే ప్రభు మార్గం లో నడుచుటకు ,ప్రతి రోజు మనకు ఎదురైయే సమస్యలు ,సాతాను క్రియలకు దూరం గా ఉండేలా చేస్తుంది ."కలసి ప్రార్దించే కుటుంబం కలసి జీవిస్తుంది"

కుటుంబ జపమాల :

ప్రస్తుత కాలము లో కుటుంబ జపమాల ఆవశ్యకత ఎంతో వుంది .ఎందుకంటే కుటుంబములోని ఐక్యత పెంచుటకు జపమాల ఎంత గానో ఉపయోగ పడుతుంది .  దేవమాత సహాయం తో ప్రభువుకు దగ్గరగా మనము జీవించేటట్లు ఈ జపమాల చేస్తుంది .

 

మన ఆలయం :

మన దేవాలయము లో ప్రతి ఒక్క కుటుంబ సహాయము ఎంతో వుంది .ఎందుకంటే దేవుని ఆలయం శుభ్రముగా చూచుకొనుటకు ,గురువుకు సహాయముగా ఉండుటకు మరియా క్రిస్తు ప్రభువు చూపిన ప్రేమ, సేవ ను ఇతరులకు అందించుటకు ఎల్లప్పుడు ముందుండాలి .ఒక మంచి క్రైస్తవ కుటుంబం  చేసే పనిని ద్వారా దేవుని నామమును ఘనపరిచే వారీగా ఉంటుంది .

 

ఇలాంటి క్రైస్తవ కుటుంబాలు దేవుని రాజ్యాన్ని ప్రకటయించే వారీగా ఉండాలని కోరుకుంటూ ,వారి కొరకు ప్రార్దించుదాము .ఆమెన్

Add new comment

11 + 4 =